రికార్డ్: ఆదియోగి విగ్రహానికి గిన్నీస్ బుక్ లో చోటు

shivaఈషా ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆదియోగి భారీ విగ్రహం గిన్నీస్ బుక్ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీవాసుదేవ్.. భక్తుల సహకారంతో 113 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని నిర్మించారు. గతేడాది మహాశివరాత్రి రోజున ప్రధాని మోడీ దీన్ని ఆవిష్కరించారు. తమిళనాడు కోయంబత్తూరులోని ఈ విగ్రహాన్ని.. అతిపెద్ద విగ్రహంగా గుర్తించారు గిన్నీస్ బుక్ అధికారులు. తమ విగ్రహానికి గిన్నీస్ లో చోటు దక్కడంపై జగ్గీవాసుదేవ్ అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy