రికార్డ్ ల ‘బ్యాంగ్ బ్యాంగ్’…

bang-bang-4హృతిక్ రోషన్ ‘బ్యాంగ్ బ్యాంగ్’ మూవీ కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తుంది. రూ.140 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటి వరకూ వాల్డ్ వైడ్ గా రూ. 150 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. అయితే హృతిక్ పేరుతో ఉన్న క్రిష్ 3 రికార్డ్ లను మాత్రం మూవీ బ్రేక్ చేయలేకపోయింది. గతేడాది దీపావళికి రిలీజైన క్రిష్-3 మూవీ నాలుగు రోజుల్లో రూ.108 కోట్లు కలెక్ట్ చేయగా… ‘బ్యాంగ్ బ్యాంగ్’  ఆ రికార్డులను అందుకోలేదు. ఇప్పటి వరకూ ఇండియాలో ‘బ్యాంగ్ బ్యాంగ్’ రూ.94 కోట్లు కలెక్ట్ చేయగా…వంద కోట్ల మార్క్ ను ఈ రోజు అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఫస్ట్ డే రూ.27కోట్లు, రెండో రోజు రూ.24 కోట్లు, మూడో రోజు రూ.20 కోట్లు, నాల్గో రోజు రూ.22 కోట్లు కలెక్ట్ చేసింది ‘బ్యాంగ్ బ్యాంగ్’ మూవీ. ఇక ఓవర్ సీస్ లో ఈ మూవీ రూ.41 కోట్ల కలెక్షన్లు కలెక్ట్ చేసింది. ఇక త్వరలోనే ఈ మూవీ కలెక్షన్లు రూ.200 కోట్లు మార్క్ చేరుతుందని అంచనా వేస్తున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy