రిజర్వ్‌ రికార్డ్ : సుప్రీం చరిత్రలో ఆధార్ రెండో కేసు

aadharబ్యాంక్ అకౌంట్, పాస్ పోర్ట్, పాన్ కార్డు, మొబైల్ లాంటి అన్నింటికి ఆధార్ తప్పనిసరి అంటూ వేసిన 27 పిటిషన్లపై సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఆధార్ చట్టబద్ధతపై దాఖలైన పలు పిటిషన్లపై గురువారం (మే-10) విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ లో ఉంచింది. ఈ విచారణలో ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించగా.. సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, చిదంబరం, రాకేశ్ ద్వివేది, శ్యామ్ దివాన్, అరవింద్ డాటార్ వివిధ పిటిషనర్ల తరఫున వాదించారు.

దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఏకే సిక్రి, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్ ఉన్నారు.
సుప్రీంకోర్టు చరిత్రలో అత్యధిక రోజులు విచారణ జరిగిన రెండో కేసు ఇదని అటార్నీ జనరల్ వేణుగోపాల్ వెల్లడించారు. కేశవానంద భారతి కేసును అత్యధికంగా 68 రోజుల పాటు విచారించింది సుప్రీంకోర్టు. నాలుగు నెలల సమయం.. 38 రోజుల ఆధార్ సుదీర్ఘ విచారణ.. చివరికి తీర్పు వాయిదా పడింది. ఆధార్‌ పై విచారణలో భాగంగా మొబైల్ నంబర్లను ఆధార్‌ తో అనుసంధానించాలన్న తమ నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్థించుకుంది.

అయితే తమ తీర్పును తప్పుగా అర్థం చేసుకొని మొబైల్ యూజర్లందరికీ ఆధార్ తప్పనిసరి చేయడానికి ఆ తీర్పునే పావుగా వాడుకున్నదని కోర్టు అభిప్రాయపడింది. కర్ణాటక హైకోర్టు మాజీ జడ్జి కేఎస్ పుట్టస్వామితోపాటు పలువురు ఆధార్ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పక్షాల వాదనలు పూర్తికావడంతో దీనిపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తీర్పు ఆగస్టులో ఉండవచ్చని తెలుస్తోంది.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy