రిజిస్టర్ అయిన ‘పోకిరి రిటర్న్స్’ టైటిల్

wp-75pokiri800టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా వచ్చిన ‘పోకిరి’ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. 2006లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే రీసెంట్ గా ఫిలిం ఛాంబర్ లో ‘పోకిరి రిటర్న్స్’ అనే టైటిల్ రిజిస్టర్ అయింది. ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఈ నిర్మాత రీసెంట్ గా రాం గోపాల్ వర్మతో ఐస్ క్రీం మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ప్రస్తుతం ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా పోకిరీ సీక్వెల్ గా తీయనున్నారా…?ఒకవేళ సీక్వెల్ అయితే మళ్ళీ మహేష్-పూరీ కాంబినేషన్ లోనే రూపొందనుందా లేక మార్పులు జరుగుతాయా అని ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy