రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ప్రియమణి

priyamaniముద్దుగుమ్మ ప్రియమణి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ముంబైకి చెందిన బిజినెస్ మేన్ ముస్తఫారాజ్‌తో ప్రియమణి వివాహం బుధవారం(ఆగస్టు-23) బెంగళూరు బనశంకరిలో జరిగింది. ప్రియమణి- ముస్తఫారాజ్‌ స్నేహితులు. గత ఏడాది వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. తమ వివాహాన్ని రిజిస్టర్‌ చేసుకునేందుకు గత జులైలో జయనగర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గురువారం(ఆగస్టు-24) జేపీనగరలో వివాహ విందు ఇవ్వబోతున్నట్టు ప్రియమణి కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ వివాహానికి అభిమానులను ఆహ్వానించలేకపోతున్నానని, వివాహానంతరమూ తాను సినిమాలు చేస్తానని ప్రియమణి గతంలోనే వెల్లడించారు. బెంగళూరులో స్థిరపడిన మలయాళీ కుటుంబానికి చెందిన ప్రియమణి ‘ఎవరే అతగాడు’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ‘పెళ్లైన కొత్తలో’తో టాప్  హీరోయిన్ల జాబితాలో చేరారు. నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్‌ తదితర టాప్ హీరోల సినిమాల్లో అలరించిన ప్రియమణి.. తమిళం, మళయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy