రిపబ్లిక్‌ డే స్పెషల్ : జియో 50శాతం డేటా ఫ్రీ

JIOటెలికాం రంగంలో కొత్త ప్లాన్లు.. ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న రిలయన్స్ జియో.. మరోసారి తన ప్లాన్లను అప్ గ్రేడ్ చేసింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా జియో ఆఫర్స్ ఇచ్చింది. రూ.98 కొత్త ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌పై అన్ లిమిటెడ్ కాల్స్, 2GB డేటాను 28 రోజులు అందించనున్నట్టు ప్రకటించింది. ఇతర ప్లాన్స్ పై ప్రస్తుతం రోజుకు 1 GB డేటా బదులు 1.5GB డేటాను, 1.5 GB డేటా ప్యాక్స్‌పై 2GB డేటాను ఆఫర్‌ కింద అందిస్తున్నట్లు తెలిపింది. దీని కోసం ఎలాంటి అదనపు ఛార్జీ వసూలు చేయటం లేదు.

రూ. 149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్‌లపై వరుసగా 42 GB, 105 GB, 126 GB, 136 GB డేటా ఇస్తోంది. 28 రోజులు, 70 రోజులు, 84 రోజులు, 91 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్యాక్‌లపై అంతకముందు రోజుకు 1 GB డేటా మాత్రమే ఉండేది. ప్రస్తుతం 1.5 GB డేటాను జియో ఆఫర్‌ చేయనుంది.

అంతేకాదు 1.5 GB డేటా ప్యాక్‌ అయిన రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్‌లపై రోజుకు.. 2 GB చొప్పున 56 GB, 140 GB, 168 GB, 182 GB డేటా లభించనుంది. రిపబ్లిక్‌ డే నుంచి ఈ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. అన్ని ప్యాక్‌లపై 50 శాతం ఎక్కువ డేటా లభించనుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy