రిపోర్ట్ కార్డ్ : మోడీ మూడేళ్ల పాలన ఎలా ఉంది?

modi-man-ki-bathఆ గెలుపు దేశ చరిత్రలో ఒక మలుపు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తో  అధికారంలోకి వచ్చింది ఎన్డీయే. దేశంలో సొంతంగా అధికారం చేపట్టేందుకు కావాల్సిన  సీట్లు గెలిచింది బీజేపీ. పదేళ్లు అధికారంలో ఉన్న  కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడ దక్కలేదు. ఇదంతా జరిగేందుకు కారణం ఒక్కరే. ఆయనే ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ గెలుపులో ఎక్కువ భాగం ఓట్లు ఆయన చరిష్మాతో వచ్చినవే.

ప్రధానిగ సరిగ్గా మూడేళ్ల కిందట ఇవాల్టి రోజున్నే ప్రమాణ స్వీకారం చేశారు మోడీ. తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కుప్పలు తెప్పలుగా ఉన్న చట్టాల్లో పనికి రాని వాటిని తీసేయడం, మేక్ ఇన్ ఇండియా, జన్ ధన్ యోజన, సర్జికల్ స్ట్రైక్స్, పాకిస్తాన్ లో దిగి నవాజ్ షరీఫ్ ఇంట్లో ఫంక్షన్ కు పోవడం అట్లాంటి వాటిల్లో కొన్ని.

ఇక మూడేళ్లల్లో తీసుకున్న నిర్ణయాల్లో అన్నిటికంటే ఎక్కువ ప్రభావం చూపెట్టింది పెద్ద నోట్ల రద్దు. దీంతో చాలా విమర్శలు వచ్చాయి. అయినా పాత 500, వెయ్యి నోట్లు తీసేసి.. కొత్తగా రూ. 500,రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చారు మోడీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి పెద్ద ఆర్థిక సంస్కరణగా  జీఎస్టీనీ తీసుకొస్తుంది మోడీ సర్కార్.  అన్ని పథకాలను ఆధార్ తో లింక్ చేసి… వాటి అమల్లో పారదర్శకత తెచ్చింది. ఈ మూడేళ్లలో కేంద్రంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకపోవడం పెద్ద విజయంమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చాకా రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరిగింది. ఈ మూడేళ్లలో మొత్తం 13 రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది. ఉత్తరప్రదేశ్, అసోం లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఇక ఢిల్లీ, బీహార్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఓటమి తప్పలేదు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టింది. తమిళనాడులో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తరాఖండ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్ లలో ఇంతకు ముందున్న ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నం చేసిందన్న విమర్శలను ఎదుర్కొంది నమో సర్కార్

మొదటి రెండేళ్లల్లో చాలా బయటదేశాల్లో తిరిగారు ప్రధాని మోడీ. దీనిమీద విమర్శలు బాగానే వచ్చాయి. అయినా.. అంతర్జాతీయంగా భారత బ్రాండ్ ఇమేజ్ ను మార్చడంలో బాగా ఉపయోగపడ్డాయన్న పేరూ ఉంది. పవర్ ఫుల్ లీడర్ గా బయట దేశాల్లో మోడీ పేరు తెచ్చుకున్నారు. ఒబామాతో దోస్తీ చేసి… అమెరికాతో  సంబంధాలను మరింత బలోపేతం చేశారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఒంటరిని చేశారు. అయినా.. అక్కడి నుంచి చొరబాట్లను ఆపలేకపోయారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు దేశానికి ప్రత్యేకంగా రక్షణ మంత్రి లేకపోవడంతో విపక్షాలు విరుచుకుపడుతున్నాయ్. దేశవ్యాప్తంగా అసహనం కామెంట్లు, కశ్మీర్లో సైన్యం మీద జరుగుతున్న రాళ్లదాడులు, గోరక్షక దళాల పేరుతో కొంత మంది చేస్తున్న దాడుల్ని ఆపలేకపోవడం కేంద్రానికి ఒకింత మైనస్ గ మారాయ్

యూపీఏ సర్కార్ తో పోల్చుకుంటే నిత్యావసరాల ధరలు తగ్గలేదు. ఫసల్ బీమా యోజన లాంటి పథకాలను తెచ్చినా.. రైతుల పరిస్థితుల్లో మార్పురాలేదు. వాళ్ల పంటలకు గిట్టుబాటు ధర అందట్లేదు. అన్నదాతల ఆత్మహత్యలు ఆగలేదు. స్వచ్ఛ్ భారత్, స్మార్ట్ సిటీల్లాంటి పథకాల లక్ష్యానికి …. ఫలితానికి చాలా తేడా ఉందన్న వాదనలున్నాయ్. ప్రజల కొనుగోలు శక్తిగాని, జీవన ప్రమాణాలు కానీ పెరగలేదు. ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు అకౌంట్లో వేస్తామన్న ఎన్నికల హామీ మాట ఎక్కడా కనిపించడం లేదు. కొత్త ఉద్యోగాల మీద కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలూ ఉన్నాయ్

మోడీ పాలనకి మూడేళ్లు పూర్తవడంతో.. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు ప్లాన్ చేశారు. ఇంకో 20 రోజుల పాటు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతారు. శుక్రవారం అసోంలో ఈ ప్రచారాలను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy