రిమోట్ కంట్రోల్ @ 109

logitech-harmony-touch-is-the-ultimate-remote-control-review--98edb1bbfcఅవసరంలో నుంచి ఆవిష్కరణ పుట్టుకొస్తుంది. ఆలోచనలకు పదునుపెడితే… ప్రాసెస్ ఈజీ అవుతుంది. మనిషి సుఖంగా ఉండేందుకు ఎన్నో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను కనిపెట్టారు సైంటిస్టులు. కూర్చున్న చోట నుంచి కదలకుండా చేసే మరెన్నో ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. అలాంటివాటిలో రిమోట్ కంట్రోల్ ఒకటి. అది పుట్టింది ఈరోజే. రిమోట్ కంట్రోల్ హిస్టరీపై హ్యావ్ ఏ లుక్. రిమోట్ కంట్రోల్. దీని వాడకం గురించి… ఉపయోగాల గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. మోడరన్ వరల్డ్ లో ప్రతీ ఇంట్లో నిత్యావసరంగా సెటిలైంది రిమోట్ కంట్రోల్. ఒక్క టీవీ కోసమే కాదు.. ఏసీలు, రోబోలు, మరెన్నో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆపరేటింగ్ కోసం రిమోట్ వాడకం తప్పనిసరి అయింది ఈ రోజుల్లో.

మనిషి చేతిలో కీ గాడ్జెట్ గా మారింది రిమోట్ కంట్రోల్. 1906 సెప్టెంబర్ 25న దీని గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. లియోనార్డో టోర్రెస్ క్యూవెడో అనే వ్యక్తి దీన్ని కనిపెట్టాడు. దీనికి లియోనార్డో పెట్టిన పేరు టెలికనో. అప్పట్లో స్పెయిన్ లోని బిల్బో కోటలో అందరూ చూస్తుండగా రిమోట్ తో పడవను కంట్రోల్ చేసి చూపించాడు. ఆ తర్వాత టెక్నాలజీ వరల్డ్ రూపురేఖలే మారిపోయాయి.

రిమోట్ కంట్రోల్ కు నూటపదేళ్ల చరిత్ర ఉన్నా.. అది విస్తృతంగా వాడకంలోకి వచ్చింది కొన్నేళ్ల నుంచే. టీవీ రెవల్యుషన్ తర్వాతే రిమోట్ కంట్రోల్ కు మంచిరోజులొచ్చాయి. ఆ తర్వాత ఏసీలు, రోబోల ఆపరేటింగ్ లోనూ ఈ గాడ్జెట్ కీలకంగా మారింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy