
రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం 2017 జనవరి 1 తర్వాత ప్రారంభమైన లేఔట్లు, అపార్ట్ మెంట్లు ‘రెరా’లో నమోదు చేసుకునేందుకు ఇప్పటికే కావలసిన గడువును అధికారులు ఇచ్చారు. దీంతో కొత్త వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు ‘రెరా’ అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన సేల్స్ చేయాలి. లేకపోతే ఆయా ప్రాజెక్టుల వివరాలను కొనుగోలుదారుల ముందు ప్రదర్శించడానికి వీలులేదని అధికారులు తెలిపారు. ‘రెరా’లో సభ్యత్వం లేకుండా ప్రాపర్టీషో లో ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తే షోకాజ్ నోటీసులు ఇచ్చి..లీగల్ కేసులు కూడా బుక్ చేస్తామన్నారు.
‘రెరా’లో రిజిస్టర్ అవ్వని ప్రాపర్టీల గురించి టీవీ, పేపర్లలో యాడ్స్ కూడా ఇవ్వొద్దని అధికారులు చెప్పారు. ప్రాపర్టీ షోలో ఏదైనా ప్రాజెక్టు గురించి తెలుసుకునే ముందు కస్టమర్స్ తప్పకుండా ఆ ప్రాజెక్టు ‘రెరా’లో నమోదైందా లేదా అని అడగాలని అధికారులు తెలిపారు.