రిలయన్స్ నుంచి రోమింగ్ ఫ్రీ..

VBK-RCOM_1093921eమొబైల్ ఫోన్ రంగంలో రిలయన్స్ కొత్త స్కీంకు ఎంట్రీ ఇచ్చింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ రోమింగ్ ను ఎత్తివేసింది. వన్ ఇండియా..వన్ రేట్ అనే పేరుతో కొత్త స్కీంను రిలీజ్ చేసింది. రిలయన్స్ లోని పొస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ యూజర్లకు రోమింగ్ ఫ్రీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తే ఇన్ కమింగ్ కాల్ కి కూడా రోమింగ్ వర్తిస్తుంది. అయితే ఇక నుంచి రిలయన్స్ మొబైల్ వాడే వారికి ఎటువంటి ఎక్స్ ట్రా చార్జ్ లు పడవు.

ఇక రిలయన్స్ సిమ్ వాడే ప్రతి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఈ ప్లాన్ వర్తిస్తుంది. పోస్ట్ పెయిడ్ కష్టమర్లకు ఏ రాష్ట్రంలో ఉన్నా సేమ్ ప్లాన్ వర్తిస్తుందని, ఇక ఇంటర్నెట్ లలోనూ ఎలాంటి రోమింగ్ ఛార్జ్ పడదని రిలయన్స్ కంపెనీ సీఈవో వినోద్ స్వామి తెలిపారు. ప్రీపెయిడ్ కస్టమర్లకు కూడా ఇవే ఆఫర్లు వర్తిస్తాయని ఆయన తెలిపారు. ఇండియాలో ఎక్కడ ఉన్నా ఒకే ఆఫర్ కు చెందిన కాస్ట్ పడుతుందని  ఆయన స్పష్టం చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy