రిలీజ్ కి ముందే లీకైన స్టార్ హీరో సినిమా

toilet-ek-Prem-Katha-1498719833కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే.. విడుదలకు ముందే ఇంటర్నెట్ లో లీక్ కావడంపై నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ’ సినిమాకి ఇప్పుడు ఇవే కష్టాలు ఎదురయ్యాయి. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్న ఈ సినిమా ముందే ఆన్‌లైన్‌ లీకవడం పై సినిమా యూనిట్ కలకలం సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం స్వచ్ఛభారత్‌ను ప్రమోట్ చేస్తూ తెరకెక్కిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం లీకైంది.
ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా ట్వీట్ చేశాడు. అక్షయ్ కుమార్, భూమి పద్నేకర్లు హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంట్లో మరుగుదొడ్డి ఆవశ్యకతని ఓ ప్రేమ కథ ద్వారా తెలియజెప్పారు. ఇంట్లో మరుగుదొడ్డి లేని కుటుంబాల్లో మహిళలు ఎన్ని ఇబ్బందులకి గురవుతున్నారనే సమస్యలపై దర్శకుడు నారాయణ్‌ సింగ్‌ ఈ సినిమా ద్వారా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ విడుదల కన్నా ముందుగానే సినిమా లీకవడం దర్శకుడు, నిర్మాతలకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy