రిలీజ్ కు రెడీగా ‘అడవి కాచిన వెన్నెల’…

Meenakshi Dixit Hot Cleavage from Adavi Kachina Vennela Movie (2)టాలీవుడ్ లో మరో కొత్త మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. బుషి ఫేం అరవింద్ కృష్ణ హీరోగా అడవి కాచిన వెన్నెల మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి దీక్షిత్, పూజరామచంద్రన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మూన్ లైట్ డ్రీమ్ బ్యానర్ పై అక్కి విశ్వనాధరెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆయనే మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ తో పాటు అన్ని పనులు కంప్లీట్ చేసుకోని రిలీజ్ కు రెడీగా ఉంది.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీ నిజాం, వైజాగ్ హక్కులను సొంతం చేసుకున్నారు. అక్కడ రిలీజ్ చేయనున్నాడు. దర్శకుడు, నిర్మాత అయిన అక్కి విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ దిల్ రాజు ఈ మూవీని రిలీజ్ చేయడం మాకు చాలా ప్లస్ పాయింట్ అని…ఇండస్ట్రీలో ఈ మూవీ గురించి ఇప్పటికే పాజిటీవ్ టాక్ వచ్చిందన్నారు. మిగతా ఏరియాల నుంచి కూడా  పెద్ద పెద్ద నిర్మాతలు మూవీని రిలీజ్ చేయడం కోసం ముందుకోస్తున్నారని ఆయన అన్నారు.

రెగ్యులర్ మూవీల్లా కాకుండా కాస్త డిఫరెంట్ గా మూవీని తీశామన్నారు. మూవీని చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతారని ఆయన అన్నారు. దిల్ రాజు కారణంగా మూవీ క్రేజ్ మరింత పెరిగిందన్నారు. తప్పకుండా మూవీ మంచి హిట్ అవుతోందన్నారు విశ్వనాధరెడ్డి. ఈ మూవీకి మ్యూజిక్ ను కార్తీక్ రోడ్రిగ్విజ్ అందించారు. త్వరలోనే మూవీని రిలీజ్ చేస్తామన్నారు.

అడవి కాచిన వెన్నెల మూవీ ట్రైలర్….

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy