రివ్యూ : అజ్ఞాతవాసి

agnathavasiకథ : ఫ్యామిలీ డ్రామా

నటీనటులు : పవన్ కల్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్, బొమన్ ఇరానీ, రావు రమేష్, ఖుష్భూ

మ్యూజిక్ : అనిరుధ్

డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత : రాధాకృష్ణ (చినబాబు)

రిలీజ్ డేట్ : 10 జనవరి, 2018

జల్సా, అత్తారింటికి దారేది తర్వాత హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాలని తీసిన మూవీ ఇది. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ అనగానే అంచనాలు బాగా పెరిగాయి. సంక్రాంతి బరిలోకి దిగటంతో సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుందని భావించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్, టీజర్స్ మంచి రెస్పాన్స్ రావటంతో రికార్డ్స్ బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ లెక్కలు వేశారు. ఇలాంటి ఎన్నో అంచనాలు, ఊహల మధ్య రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ క్లుప్తంగా :

ఓ పెద్ద కంపెనీకి అధినేత గోవందా భార్గవ్ (బోమన్ ఇరానీ). అతన్నీ,అతని వారసుడైన కొడుకును చంపేస్తారు. అనుకోని ఘటనతో కంపెనీ వ్యవహారాలు చూసేందుకు అతని భార్య (ఖుష్బూ) ఓ వ్యక్తిని తీసుకొస్తుంది. అతనే పవన్ కల్యాణ్ (బాల సుబ్రమణ్యం). మేనేజర్ స్థాయిలో ఉద్యోగంలో జాయిన్ అవుతాడు హీరో. కంపెనీని ఎలా చక్కదిద్దాడు.. వారసుడి హత్యను ఎలా ఛేదిస్తాడు.. అసలు ఈ బాల సుబ్రహ్మణ్యం ఎవరు అనేది సప్పెన్స్.?

ఎవరెవరు ఎలా నటించారు :

పవన్ కల్యాణ్ యాక్టింగ్ బాగుంది. తన స్టయిల్ తో ఆకట్టుకున్నాడు. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది.. పవర్ లుక్స్ అభిమానులను ఫిదా చేశాయి. సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ లోనూ తన అభినయంతో పండించాడు. కామెడీ, రొమాంటిక్ టచ్ తో సినిమాని నడిపించాడు. హీరోయిన్స్ కీర్తి, అను పాత్రలకు ఇంపార్టెన్స్ లేదు. గ్లామర్ వరకు పరిమితం అయ్యారు.. సీనియర్ యాక్టర్ కుష్భూ హుందా గల పాత్రలో మెప్పించింది..కానీ పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్నా క్యారెక్టర్ కాదు. యంగ్ విలన్ గా ఆది పినిశెట్టి మరోసారి మెప్పించాడు. మురళీ శర్మ,రావురమేష్ తమ పరిధిలో బాగానే చేసినా..కామెడీ కోసం వాళ్లను వాడుకున్న పద్దతి కొన్నిసార్లు విసిగిస్తుంది. మిగతా నటీనటులు తమ పరిధి వరకు నటించారు., కాకపోతే పాత్రలన్నీ కూడా ఎక్కడో కనెక్ట్ అవుతున్న ఫీలింగ్ మాత్ర ప్రేక్షకుడికి రావటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

సినిమా ఎలా ఉంది అంటే :

అజ్ఞాతవాసి.. ఓ మర్డర్ కేసును ఛేదించటం కోసం హీరో రావటం, వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడటం అనే పాయింట్ చుట్టూ కథ నడుస్తోంది. పాత్రలు బలంగా ఉన్నా.. కథలో కొత్తదనం కనిపించదు. పవన్ కల్యాణ్ హీరో కావటం ఈ కథకు ప్లస్ పాయింట్. త్రివిక్రమ్ కు అలవాటు అయిన ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, హీరోయిన్స్ ను గ్లామర్ గా చూపించటంతో నేటివిటీకి దగ్గరగా ఉంది. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ్ పాత్రను తీర్చిదిద్దినట్లు స్పష్టంగా తెలుస్తోంది.. కొత్త ప్రయోగాల జోలికి వెళ్లకుండా.. అత్తారింటికి దారేది మూవీలో ఎంత స్మార్ట్ గా అయితే ఉంటాడో.. ఈ మూవీలోనే అలాగే కనిపించటం విశేషం.

హత్య అనగానే ట్విస్ట్ లు, విలన్స్ ను భారీగా ఊహించుకుంటాం. అంత స్కోప్ ఇవ్వలేదు డైరెక్టర్. హీరో మాత్రమే కనిపిస్తాడు. విలన్ ఉన్నా హైలెట్ కాడు. సో.. సినిమా మొత్తం.. స్కీన్ అంతా పవన్ మాత్రమే కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటాడు. ఫస్టాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. పెద్దగా కథలోకి వెళ్లకపోవటమే ఇందుకు కారణం. ఇంటల్వెల్ ముందు వచ్చే 10 నిమిషాలు మాత్రం బాగా రిలీఫ్ గా ఉంటుంది. స్టోరీ ఊపందుకుంది అనిపిస్తుంది ప్రేక్షకుడికి.కానీ సెకండాఫ్ మొదలైన తర్వాత కూడా ఒక్క ఇంటెన్స్ ఉన్న సీన్ లేకపోవడం,సిల్లి కామెడీ ట్రాక్ బోర్ కొట్టిస్తాయి.సెకండాఫ్ మొత్తంలో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎంగేజింగ్ గా లేదు అంటే అర్థం చేసుకోవచ్చు త్రివిక్రమ్ స్క్రిప్టు ఎంత నాసిరకంగా ఉందో..స్టార్ డైరెక్టర్ అయన త్రివిక్రమ్ నుండి ఎక్స్ పెక్ట్ చేయాల్సిన మూవీ అయితే కాదు.

2 గంటల 40 నిమిషాల సినిమాలో ఎడిటింగ్ కు కొంచెం అవకాశం ఉంది అనిపిస్తుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ బాగా కుదిరాయి. రిచ్ గా తెరకెక్కిన విధానం చూస్తుంటే.. నిర్మాత డబ్బులు ఏ స్థాయిలో ఖర్చు పెట్టాడో అర్థం అవుతుంది. కంటి హాయిగా ఉన్నా.. కథలో లీనమైపోయేంతగా అయితే లేదు అని చెప్పాలి..

ప్లస్ పాయింట్స్ :

పవన్ కల్యాణ్, ఇంటల్వెల్ ముందు సీన్స్, కొన్ని కామెడీ సీన్స్, డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విలన్ పాత్రలు బలంగా లేకపోవటం, హీరోయిన్స్, స్క్రీన్ ప్లే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy