రివ్యూ: అమర్ అక్బర్ ఆంటోని

రన్ టైమ్: 2 గంటల 32 నిమిషాలు

నటీనటులు: రవితేజ,ఇలియానా,సునీల్,షియాజీ షిండే,వెన్నెల కిషోర్,రఘుబాబు,సత్య,శ్రీనివాసరెడ్డి,తదితరులు

మ్యూజిక్: తమన్

సినిమాటోగ్రఫీ: వెంకట్.

నిర్మాతలు: మైత్రీ మూవీస్

రచన,దర్శకత్వం: శ్రీను వైట్ల

 కథేంటి?

అమర్ కి డిసోసియేటివ్ మల్టిపుల్ డిజార్డర్ ప్రాబ్లమ్ ఉంటుంది.తనకు తెలియకుండా మూడు రూపాలుగా బిహేబ్ చేస్తుంటాడు.ఓ ఇద్దరు బడా బిజినెస్ మేన్ లను కూడా చంపేస్తాడు..ఆ మర్డర్ కేసులను ‘‘ఎఫ్.బి.ఐ’’ ఇంటరాగేట్ చేస్తుంది.ఇతనికి ఏమైంది.ఎందుకలా వాళ్లను చంపుతున్నాడు ?దీని వెనక ఎలాంటి రివేంజ్ స్టోరీ ఉంది అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

రవితేజ ఎప్పటిలాగానే ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.ఇలియానా నటనపరంగా ఓకే కానీ,చాలా లావుగా కనిపించింది.విలన్స్ అందరూ వీక్ అయిపోయారు.కమెడియన్లు వెన్నెల కిషోర్,సునీల్,సత్య లు కాస్త ఎంటర్ టైన్మెంట్ పండించారు.ముఖ్యంగా కె.ఎ పాల్ శిష్యుడిగా సత్య పండించిన కామెడీ బాగా నవ్విస్తుంది.షియాజీ షిండే,శుభలేఖ సుధాకర్ లు తమకు అలవాటైన పాత్రల్లో రాణించారు.

టెక్నికల్ వర్క్:

వెంకట్.సి.దిలీప్ కెమెరా వర్క్ మెప్పిస్తుంది.యు.ఎస్ లొకేషన్లను బాగా ఉపయోగించుకొని సినిమాను చాలా రిచ్ గా చూపించాడు.తమన్ డిజప్పాయింట్ చేశాడు.పాటలు బాగోకపోగా,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా ఇంప్రెస్ చేయలేకపోయాడు.నిర్మాణ విలువలు బాగున్నాయి.ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది.కొన్ని డైలాగులు బాగున్నాయి.

విశ్లేషణ:

వరుస ఫ్లాపులతో బ్యాడ్ ట్రాక్ లో ఉన్న శ్రీనువైట్ల ‘‘అమర్ అక్బర్ ఆంటోని’’ తో మరోసారి నిరాశపరిచాడు..ఈ సారైనా ఫామ్ లోకి వస్తాడనుకుంటే..రొటీన్ రివేంజ్ స్టోరిలో,తన మార్కు ఔట్ డేటెడ్ కామెడీ ని ఇరికించి బోర్ కొట్టించాడు.‘‘అతనొక్కడే’’ లాంటి స్టోరీతో హీరోకి అపరిచితుడు తరహాలో ‘‘డిసోసియేటివ్ మల్టిపుల్ డిజార్డర్’’ అనే ప్రాబ్లమ్ పెట్టాడు వైట్ల..మొదలైన కొద్దిసేపు కాస్త ఇంట్రెస్టింగా,ఫన్ గా అనిపించినా.. ఆ డిజార్డర్ కొన్ని సందర్భాల్లో సిల్లీగా అనిపిస్తుంది.. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా..సెకండాఫ్ లో ముగింపేంటో తెలిసిపోయాక మరీ రొటీన్ గా తయారై ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుందీ సినిమా..కమెడియన్లు సత్య,సునీల్,వెన్నెల కిషోర్ లు కాస్త ఎంటర్ టైన్మెంట్ అందించినా..పకడ్బందీ స్క్రీన్ ప్లే లేకపోవడం,సీన్లల్లో ఎమోషన్ పండకపోవడం వల్ల థియేటర్ నుండి ఎప్పుడు బయటకెళ్దామా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు శ్రీనువైట్లను నమ్మినందుకు హీరో రవితేజ,ప్రొడ్యూసర్ల మీద జాలి కలగక మానదు.మరోసారి వచ్చిన పెద్ద అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు వైట్ల. మొత్తం మీద‘‘అమర్ అక్బర్ ఆంటోని’’ లో కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నా..రొటీన్ కథ,బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల టోటల్ డిజప్పాయింట్ చేస్తుంది.

బాటమ్ లైన్: డిజప్పాయింటింగ్ డిజార్డర్

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy