రివ్యూ: అర్జున్ రెడ్డి

Arjun-Reddy-Reviewరన్ టైమ్: 3 గంటల 6 నిమిషాలు

నటీనటులు: విజయ్ దేవరకొండ,షాలిని,రాహుల్ రామకృష్ణ,కాంచన, కమల్ కామరాజు,సంజయ్ స్వరూప్

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

మ్యూజిక్: రథన్

నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగ

రచన,దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ

రిలీజ్ డేట్: ఆగస్ట్ 25,2017

టీజర్ తోనే సంచలనం సృష్టించిన ‘‘అర్జున్ రెడ్డి’’ మూవీ మీద అందరికీ క్లారిటీ ఉంది. తాము ఎలాంటి సినిమా రిలీజ్ చేయబోతున్నాం,తమ టార్గెట్ ఆడియన్స్ ఎవరనేది డైరెక్టర్ ముందే రిజిస్టర్ చేశాడు.అందరు అనుకున్నట్టుగానే.బోల్డ్ అండ్ కల్ట్ అటెంప్ట్ చేశాడు డైరెక్టర్. రెగ్యులర్ తెలుగు సినిమాలో వస్తున్న లవ్ స్టోరీలా కాకుండా ట్రెండీ గా తీసి డేర్ చేశాడు. డైరెక్టర్ క్లారిటీకి విజయ్ దేవరకొండ 100 కు 150 శాతం న్యాయం చేశాడు. అర్జున్ రెడ్డి అనే అగ్రెస్సివ్ క్యారెక్టర్ లో విజయ్ జీవించేశాడు.

కథగా చెప్పుకుంటే ‘‘అర్జున్ రెడ్డి’’ ది పాత స్టోరియే. కాలేజ్ లో సీనియర్ అయిన అర్జున్..కొత్తగ చేరిన ప్రీతిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు.తర్వాత ప్రీతి కూడ అర్జున్ కు పడిపోతుంది.ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు.కానీ అర్జున్ ది వేరే కులం అని ప్రీతి తండ్రి పెళ్లికి ఒప్పుకోడు.. బాగా డిజప్పాయింట్ అయిన అర్జున్ డ్రగ్స్ కు బానిస అవుతాడు.. ఈ గ్యాప్ లో బలవంతంగా పెళ్లి చేస్తారు.తర్వాత అర్జున్ పరిస్థితి ఏంటి? వీళ్లిద్దరి జీవితాల్లో ఎలాంటి సమస్యలొచ్చాయి.? తర్వాత కలుసుకున్నారా లేదా అనేది మిగతా కథ..

వినటానికి పాథ కథే అయిన.. ట్రీట్ మెంట్ ఫ్రెష్ గా ఉండటం,డైరెక్టర్ నెరేషన్ ఇప్పటి ట్రెండ్ ను ఆకట్టుకునే విధంగా ఉండటం ‘‘అర్జున్ రెడ్డి’’ యూత్ కు బాగా నచ్చేస్తాడు.కానీ..ఇది యూత్ కు మాత్రమే నచ్చుతుంది.ఎక్కువ బోల్డ్ సీన్లు,మాటలు ఉండటం తో వేరే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు.అయితే రీసెంట్ గా వస్తున్న సినిమాలకు భిన్నంగా ఉండటం సినిమాకు ప్లస్.బాలీవుడ్ లో తరచుగా వచ్చే బోల్డ్ కంటెంట్ సినిమాల లాగా ‘‘అర్జున్ రెడ్డి’’ ఉంటుంది.ఇలాంటి సినిమా తెలుగులో తీయటం మెచ్చుకోతగ్గ విషయమే.

ఇలాంటి చాలెంజింగ్ క్యారెక్టర్..కెరీర్ బిగినింగ్ లో పడటం విజయ్ లక్..థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ కావడంతో విజయ్ చెలరేగిపోయాడు.కాలేజ్ లో సీన్ల లో అగ్రెస్సివ్ పర్పార్మెన్స్, హీరోయిన్ తో రొమాంటిక్ పర్ఫార్మెన్స్..విడిపోయినప్పుడు ఎమోషనల్ పర్ఫార్మెన్స్,.చివర్లో తండ్రితో మెచ్యుర్డ్  పర్ఫార్మెన్స్.. ఇలా సినిమా అంతటా విజయే కనిపిస్తాడు.. ఓవరాల్ గ ‘‘అర్జున్ రెడ్డి’’ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసాడు విజయ్.. అత్యంత సహజమైన నటనతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఫ్యూచర్ లో స్టార్ హీరోగా మారతాడు అనటం లో ఎలాంటి సందేహం లేదు.

హీరోయిన్ షాలిని ఓకే. నటించడానికి పెద్దగా స్కోప్ లేదు కానీ ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. ఇక ‘‘అర్జున్ ’ ’ఫ్రెండ్ క్యారెక్టర్ లో రాహుల్ రామకృష్ణ ఆకట్టుకున్నాడు. తెలంగాణ డైలెక్ట్ లో రాహుల్ హిలేరియస్ కామెడీ పండించాడు.. కమల్ కామరాజు,సంజయ్ స్వరూప్ లు మెప్పించారు.

టెక్నీషియన్స్ లో కెమెరామెన్ రాజ్ తోట పనితనం బాగుంది.ఇలాంటి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాడు.రథన్ పాటలు సోసో గా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కట్టిపడేసాడు.ఎడిటింగ్ స్టైల్ కొత్తగా ఉన్నా.. సినిమాలో కొన్ని సీన్లకు కత్తెర పడాల్సింది.సెకండాఫ్ లో లెంగ్తీ ఫీల్ కులుగుతుంది.ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి రైటింగ్ బాగుంది. డైలాగ్ లు బాగా పేలాయి.

ఓవరాల్ గా ‘‘అర్జున్ రెడ్డి’’ ఒక ట్రెండీ దేవదాస్ లవ్ స్టోరీ. తెలుగులో ఇలాంటి డేరింగ్ అటెంప్ట్ చేయడం డైరెక్టర్ గట్స్ కు నిదర్శనం.తెలిసిన కథే అయినా.. దాన్ని ఇంటెన్స్ గా,అంతే హార్డ్ హిట్టింగ్ గా చెప్పిన తీరుకు మెచ్చుకోవాలి.అయితే ఈ సినిమా అందరికీ నచ్చదు. ఫ్యామిలీ ఆడియన్స్,పిల్లలతో చూసే సినిమా కాదు. అందులో ఉన్న కంటెంట్ కూడా అలాంటిది. ఫస్టాఫ్ అంతా అలరించినా..సెకండాఫ్ కొన్ని లోపాలు లున్నాయి. సినిమా లెంగ్త్ ఎక్కువ కావడం వల్ల చివరికి వచ్చే సరికి బోర్ కలుగుతుంది.ఇక క్లైమాక్స్ లో హ్యపీ ఎండింగ్ కోసం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. ఇలాంటి కల్ట్ సినిమాల్లో అలాంటి వాటికి పోకుండా రియలిస్టిక్ గానే వెళితే బాగుంటుంది..

ఓవరాల్ గా ‘‘అర్జున్ రెడ్డి’’ న్యూ ఏజ్ లవ్ స్టోరి. అందరికీ నచ్చకపోయినా.. కొత్తదనం కోరుకునే ఆడియన్స్..ముఖ్యంగా యూత్ ఫిదా అయిపోతారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy