రివ్యూ: ఆనందో బ్ర‌హ్మ 

anando-brahmaరన్ టైమ్: 2 గంటల 04 నిమిషాలు

నటీనటులు:  తాప్సి, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, తాగుబోతు ర‌మేష్, ర‌ఘు కారుమంచి  తదిత‌రులు.

సినిమాటోగ్రఫి: అనిష్ త‌రుణ్‌ కుమార్‌, సంగీతం: కె, కూర్పు:  శ్ర‌వ‌ణ్, నిర్మాత‌లు: విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: మహి వి.రాఘ‌వ్‌, సంస్థ: 70 ఎమ్‌.ఎమ్‌.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

విడుద‌ల తేదీ: 18-08-2017

`ఆనందో బ్ర‌హ్మ‌` దెయ్యం కథే అయినా.. కొత్తగా చెప్పాడు డైరెక్టర్ రాఘవ్. మనుషుల్ని చూసి భయపడే దెయ్యాల గురించి ఆకట్టుకునే విధంగా చెప్పాడు. భ‌యానికి న‌వ్వంటే భ‌యం అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కింది.  మ‌నుషుల్ని చూసి దెయ్యం ఎలా భయపడింది? దెయ్యాలకు నిజంగానే మనుషులంటే భయమా? కొద్దికాలం గ్యాప్ తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఎంత వరకు ఆకట్టుకుంది? ఇలాంటి అంశాలన్నీ తెరపై చూడాల్సిందే..

స్టోరీ లైన్: సిద్ధు (శ్రీనివాస్ రెడ్డి), ఏటీఎమ్ సెక్యూరిటీ గార్డు ఫ్లూట్ రాజు (వెన్నెల‌కిషోర్‌), తుల‌సి (తాగుబోతు ర‌మేష్‌), బాబు (ష‌క‌ల‌క శంక‌ర్‌) ఒక్కో సమస్యతో బాధపడుతుంటారు. వీరందరికీ కామన్ సమస్య డబ్బు. ఆ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో శ్రీలక్ష్మీ నిలయం అనే ఇంటిలోకి ప్రవేశిస్తారు. అక్కడే అసలు కథ ఉంది. వీళ్లు ప్రవేశించిన ఇంటిలో దెయ్యం ఉందనడంతో కొనుక్కోవడానికి ఎవరూ రారు. దీంతో ఈ ఇంటి యజమాని రాము(రాజీవ్ కనకాల) టెన్షన్ పడుతుంటాడు. రాము సమస్య గురించి తెలిసిన ఈ నలుగురు ఆ ఇంటిలో దెయ్యం అంతుచూస్తామని.. ఇల్లు అమ్మిన డబ్బులో తమకూ వాటా కావాలని కోరతారు. దానికి రాము ఒప్పుకోవడంతో.. అలా ఇంటిలోకి వస్తారు నలుగురు. మ‌రి ఆ ఇంట్లోకి వెళ్లాక వాళ్ల‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?  దెయ్యాల్ని చూసి మ‌నుషులు భ‌య‌ప‌డ్డారా?  లేక మ‌నుషుల్ని చూసి దెయ్యాలే భ‌య‌ప‌డ్డాయా?  ఇంత‌కీ ఆ శ్రీల‌క్ష్మీ నిల‌యం ఎవ‌రిది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పైనే చూడాలి.

విశ్లేషణ: కథనం అద్భుతంగా ఉంది. గతంలోని దెయ్యం కథలకు భిన్నంగా.. ఆసక్తికరంగా సాగుతోంది కథ. వింత ఏంటంటే.. ఆ ఇంట్లో ఉండే దెయ్యాలకి తాము దెయ్యాలని తెలియకపోవడం. మనుషులు ఎంటరయ్యాక తాము దెయ్యాలమని తెలుస్తుంది. అప్పుడే క‌థ‌లో స్పీడ్ పెరుగుతోంది. అస‌లు ఆ ఇంట్లో మ‌నుషులు దెయ్యాలుగా ఎలా మారార‌నే అంశం కూడా క‌థ‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

పెర్ఫార్మెన్స్: శ్రీనివాస్‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, తాగు బోతు ర‌మేష్ సందడి చేశారు. తాప్సీ తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. సాంకేతికంగా సినిమా బాగుంది. అనిష్ త‌రుణ్‌కుమార్ కెమెరా ప‌నిత‌నం చ‌క్క‌గా కుదిరింది. ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ క‌థ‌ని రాసుకొన్న విధానం, దాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన  విధానం ఆక‌ట్టుకుంది.

ప్లస్ లు:
..  స్క్రీన్ ప్లే
..  సినిమాటోగ్రఫి
.. డైరెక్షన్                                                                                                                                                       .. నటీనటులు

మైనస్ లు: 
.. కాస్త సాగతీత

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy