రివ్యూ: ఇంతలో ఎన్నెన్ని వింతలో

ENనటీనటులు : నందు, సౌమ్య వేణుగోపాల్, పూజా రామచంద్రన్, గగన్ విహారి తదితరులు

మ్యూజిక్ : యాజమాన్య

సినిమాటోగ్రఫీ : మురళీ మోహన్ రెడ్డి

నిర్మాతలు : శ్రీకాంత్ రెడ్డి,ఇప్పిలి రామ్మోహన్ రావు

డైరెక్షన్ : వరప్రసాద్ వరికూటి

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 6,2018

కథేంటి?

విష్ణు (నందు) మంచి లక్షణాలున్న కుర్రాడు.. అతన్ని చూసి వందన (సౌమ్య వేణుగోపాల్) లవ్ చేస్తుంది. విష్ణుకు కూడా వందన నచ్చడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. బ్యాచిలర్ పార్టీలో విష్ణు గ్యాంగ్ కు తార (పూజ రామచంద్రన్) పరిచయమవుతుంది. తార కారణంగా విష్ణు ఇబ్బందుల్లో పడతాడు. మరి ఆ ఇబ్బందులన్నీ ఎలా ఎదుర్కొన్నాడు.. వందనను పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మిగతా కథ

నటీనటుల పర్ఫార్మెన్స్:

హీరో నందు మంచి పర్ఫార్మర్.. ఇందులో విష్ణు అనే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సౌమ్య నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. మరో ఇంట్రెస్టింగ్ రోల్ లో పూజా రామచంద్రన్ గ్లామరస్ గా కనిపించింది. యాక్టింగ్ బాగానే చేసింది. మొదటిసారి పూర్తిస్థాయి విలన్ గా చేసిన గగన్ విహారి బాగానే చేశాడు.

టెక్నికల్ వర్క్:

యాజమాన్య సంగీతం బాగుంది. పాటలు ఓకే అనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. మురళీ మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఉన్నంతలో బాగుంది. చోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. నిర్మాతలు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

మంచి థ్రిల్లింగ్ అంశాలున్న ఈ కథను దర్శకుడు బాగానే తెరకెక్కించాడు. తను చెప్పాలనుకున్నది బాగా చెప్పాడు. ఎమోషన్స్ ను కూడా బాగా ఎలివేట్ చేశాడు. హీరో స్నేహితుల నుంచి మంచి కామెడీ సృష్టించాడు. యూత్ ఆడియన్స్ ఇలాంటి సీన్లు ఎంజాయ్ చేస్తారు. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా.. సెకండాఫ్ లో థ్రిల్లింగ్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. కొత్త దర్శకుడైన వరప్రసాద్ ఇలాంటి సబ్జెక్ట్ ను డీల్ చేయడంలో మేజర్ పార్ట్ వరకు సక్సెస్ అయ్యాడు. అయితే కాస్టింగ్ ఇంకా బలంగా ఉండి. స్క్రీన్ ప్లేను బాగా ప్రజెంట్ చేసి ఉంటే ఇంకాస్త మంచి ఔట్ పుట్ వచ్చేది. ఓవరాల్ గా ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ సినిమాలో యూత్ కు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy