రివ్యూ: ఎన్టీఆర్ కథానాయకుడు

రివ్యూ: ఎన్టీఆర్ కథానాయకుడు

రన్ టైమ్: 2 గంటల 50 నిమిషాలు

నటీనటులు: బాలకృష్ణ,విద్యాబాలన్,కళ్యాణ్ రామ్,రానా,సుమంత్,ప్రకాష్ రాజ్,మురళీ శర్మ,నిత్యా మీనన్,రకుల్,నరేష్,వెన్నెల కిషోర్, తదితరులు

మ్యూజిక్: ఎం.ఎం కీరవాణి

సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్

డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా

నిర్మాతలు: బాలకృష్ణ,విష్ణు ఇండూరి,సాయి కొర్రపాటి

కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

రిలీజ్ డేట్: జనవరి 9,2019

కథ:

లెజండరీ పర్సన్ ఎన్టీఆర్ ఏ విధంగా సినిమా రంగంలోకి వచ్చాడు.ఎలా సూపర్ స్టార్ అయ్యాడు.ఆ తర్వాత రాజకీయ రంగం వైపు ఎలా మళ్లాడు అనేది ఈ చిత్రం లో చూపించారు.. ఎన్టీఆర్ గురించి తెలియని వారికి ఈ మూవీ ద్వారా బాగా తెలుస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్:

తండ్రి పాత్ర పోషించిన బాలకృష్ణ యంగ్ ఎన్టీఆర్ లా సూట్ అవ్వకపోయినా..తర్వాత బాగున్నాడు అనిపిస్తుంది..తన నటన విషయానికిస్తే.. ఎన్టీఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుగా అనిపిస్తుంది. తన మెస్మరైజింగ్ నటనతో చిన్న చిన్న లోపాలు కూడా కనపడనీయకుండా చేశాడు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ మెప్పించింది. ఎన్టీఆర్ తో ఎలా ఉండేది..? ఎన్టీఆర్ జీవితంలో బసవతారకం పాత్ర ఏంటనేది ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉంది. హరికృష్ణ పాత్ర చేసిన కళ్యాణ్ రామ్,శ్రీదేవి పాత్రలో రకుల్.. ప్రకాష్ రాజ్,మురళీశర్మ లు కూడా రాణించారు.

టెక్నికల్ వర్క్:

జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది.కీరవాణి ఇచ్చిన పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.. చాలా సీన్లు ఆర్.ఆర్ వల్ల బాగా ఎలివేట్ అయ్యాయి. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు సినిమాకు మరో హైలైట్.చాలా సీన్లల్లో ఎన్టీఆర్ చేత చెప్పించిన డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది.నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా తీసారు. ఎడిటింగ్ లో కొన్ని సీన్లకు కత్తెర పడాల్సింది.

విశ్లేషణ:

‘‘ఎన్టీఆర్ కథానాయకుడు’’ డీసెంట్ బయోపిక్..లెజండరీ పర్సనాలిటీ రామారావు గురించి తెలియని వారికి ఆయన జర్నీ ఈ సినిమా ద్వారా తెలుస్తుంది.. డైరెక్టర్ క్రిష్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు.. తక్కువ టైమ్ లో మంచి ఔట్ పుట్ ఇచ్చాడు. కొన్ని సీన్లను ఎలివేట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడు గెటప్ లో ఎంట్రీ ఇచ్చే సీన్ చాలా బాగా తీసాడు. అలాగే రావణాసురుడి పాత్ర కోసం పడే కష్టం.. ఇలా కొన్ని ఇంపార్టెంట్ సీన్లను బాగా తీశారు. రామారావు పాత్రలో బాలకృష్ణ అభినయం మెప్పిస్తుంది. మొదట్లో ఇబ్బంది అనిపించినా.. ఆ పాత్రకు కనెక్ట్ అవ్వటం వల్ల బాగుందనిపిస్తుంది. అయితే కాస్త లెంగ్త్ ఎక్కువవడంతో కొన్ని చోట్ల బోర్ అనిపిస్తుంది. కొన్ని సీన్లు ట్రిమ్ చేసి క్రిస్ప్ గా తీసి ఉండాల్సింది. అయితే అంత పెద్ద వ్కక్తి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇలాంటివి పెద్ద లోపాలుగా అనిపించవు.. ముఖ్యంగా ఫ్యాన్స్ కు.. బాలకృష్ణ నటన,డైలాగులు,మ్యూజిక్ దర్శకత్వం ఇవన్నీ డీసెంట్ గా కుదిరాయి. తద్వారా సినిమాను ఓసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy