రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

gautamiputra-satakarni-movie-reviewరన్ టైమ్: 2 గంటల 15 నిమిషాలు

నటీనటులు: బాలకృష్ణ,శ్రియా,హేమా మాలిని,కబీర్ బేడి,తనికెళ్ల భరణి తదితరులు

సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్

సంగీతం: చిరంతన్ భట్

మాటలు: సాయిమాధవ్ బుర్రా

నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు,వై.రాజీవ్ రెడ్డి

రచన,దర్శకత్వం: క్రిష్

ఇంట్రో:

నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాగా ‘‘గౌతమి పుత్ర శాతకర్ణి’’ సెలక్ట్ చేసుకోవడం దగ్గర్నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.. తీసింది తక్కువ సినిమాలే అయినా సెన్సిబుల్ ఫిలిం మేకర్ గా తనకంటూ ఓ శైలి ఏర్పరుచుకున్న క్రిష్ ఈ సినిమాకు డైరెక్టర్ కావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది.. ఈ జనరేషన్ కు పెద్దగా తెలియని మన శాతవాహన సామ్రాజ్యాధినేత  శాతకర్ణి పోరాటాన్ని ఎలా చూపించారో తెలుసుకుందాం.

కథ:

భరత ఖండాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించిన శాతవాహన చక్రవర్తి, గొప్ప యోధుడు గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రే ఈ సినిమా.. చిన్నతనం నుంచే మన దేశంలో ఉన్న రాజుల మధ్య యుద్దాలు జరుగకూడదు,అన్ని రాజ్యాలకు కలిపి ఒకే సామ్రాజ్యం ఉండాలి అని కలలు కంటాడు.. దానికోసం కుటుంబాన్ని సైతం విడిచి యుద్దాలు చేస్తుంటాడు.. ఈ క్రమంలో శత్రువుల నుంచి ఎలాంటి సవాళ్లను ఎదుర్కున్నాడు.?చివరికి తను అనుకున్నది ఎలా సాధించాడు అనేది సినిమా?

విశ్లేషణ:

సినిమా స్టార్ట్ అయిన కాసేపటి నుంచే ప్రేక్షకులు కథలో లీనమైపోతారు..మంచి కథ,దానికి మించిన కథనంతో కట్టిపడేసాడు డైరెక్టర్ క్రిష్.. ఇంత గొప్ప చరిత్ర ఉన్న సినిమాను హై టెక్నికల్ స్టాండర్ట్స్ తో, ఇంత తక్కువ సమయంలో తీసిననందుకు క్రిష్ ను తప్పకుండా అభినందిచాల్సిందే.. సినిమా కోసం తను చేసిన రీసెర్చ్, హార్డ్ వర్క్ అంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది..ఎక్కడా గ్రాఫ్ తగ్గకుండా ప్రతీ సీన్ ను భలే ఎలివేట్ చేశాడు.. కొడుకును యుద్దానికి తీసుకెళ్లే ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండాఫ్ లో తల్లికి సింహాసనం అధిష్టింప జేసే సన్నివేశం,ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ఆయువు పట్టు.. అయితే శాతకర్ణిని పవర్ ఫుల్ గా చూపించడమే కాకుండా తన హిస్టరీ గురించి ఇంకాస్త వివరంగా చూపిస్తే బాగుండేది. క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ సాగదీసిన ఫీల్ కలుగుతుంది.

శాతకర్ణి క్యారెక్టర్ ను ఆయన తప్ప ఇంకెవరు చేయలేరేమో అన్నట్టు అదిరిపోయే పర్ఫర్మెన్స్ కనబరిచాడు బాలయ్య. వీరత్వం నిండిన యోధుడి పాత్రలో చెలరేగిపోయి నటించాడు బాలయ్య.. ఈ ఏజ్ లో కూడా యుద్ద సన్నివేశాల్లో సైతం ఎనర్జీగా నటించాడు..కాస్త బాడీ మీద దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది.. తన కెరీర్ లో చిరస్థాయి గా నిలిచిపోతుందీ చిత్రం..వందో సినిమాగా ఈ కథ సెలక్ట్ చేసుకొని మంచిపని చేశాడు.. మరో మంచి పాత్రలో శ్రియ అభినయం ఆకట్టుకుంటుంది.. తల్లి గౌతమి పాత్రలో హేమామాలిని ఫర్వాలేదు..

టెక్నికల్ గా సినిమా టాప్ నాచ్.. తక్కువ టైమ్ లో మంచి ఔట్ పుట్  ఇచ్చారు.. ముందుగా చెప్పుకోవాల్సింది కెమెరామెన్ జ్ఞానశేఖర్ పనితనం గురించి.. సినిమాను చాలా గ్రాండీయర్ గా షూట్ చేశాడు.. సినిమాకు సినిమాటోగ్రఫీయే బాగా ప్లస్ అయ్యింది. చిరంతన్ భట్ పాటలు బాగున్నాయి.. ముఖ్యంగా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు.. గ్రాఫిక్ వర్క్ చాలా బాగా చేశారు.. వార్ ఎపిసోడ్స్ లల్లో కూడా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ రిచ్ గా ఉంది.. మాతృత్వం గురించి,దేశం గురించి సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టిస్తాయి..ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి..

గౌతమి పుత్ర శాతకర్ణి  సినిమా చూస్తున్నంత సేపు క్రిష్ ను అభినందించ కుండా ఉండలేం.. ఎవరికీ సరిగా తెలియని తెలుగువాడి చరిత్రను చెప్పాలనుకోవడం,దాన్ని తక్కువ టైమ్ లో భారీగా తీయడం మాములు విషయం కాదు..దాంట్లో పూర్తిగా సక్సెస్ అయ్యాడు క్రిష్..  అంతే కాదు.. తన ముందు సినిమాల్లో కంప్లైంట్ గా ఉన్న కమర్షియల్ తాలూకు వాల్యూస్ ను ఈ సినిమాలో మిస్ అవలేదు.. శాతకర్ణిని పవర్ ఫుల్ హీరోగా ఎలివేట్ చేసి ఫ్యాన్స్ చేత విజిల్స్ కొట్టించాడు….ఓవరాల్ గా మనకు తెలియని ఈ శాతకర్ణి చరిత్రను అందరూ తప్పకుండా చూడాలి..

రేటింగ్: 3.25/5

బాటమ్ లైన్: సాహో శాతకర్ణి

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy