రివ్యూ: గౌతమ్ నంద

goutham-nandhaరన్ టైమ్: 2 గంటల 36 నిమిషాలు

నటీ నటులు: గోపిచంద్,హన్సిక, కేథరిన్ థెరిసా, చంద్రమోహన్, సీత , సచిన్ కేద్కర్, ముఖేష్ రుషి, వెన్నెల కిషోర్, అజయ్

సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్

మ్యూజిక్: థమన్

నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు

రచన,దర్శకత్వం: సంపత్ నంది

రిలీజ్ డేట్: జులై 28, 2017

ఇంట్రో:

రచ్చ…బెంగాల్ టైగర్ సినిమాలతో మాస్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది ఈ సారి యాక్షన్ హీరో గోపిచంద్ తో జత కలిశాడు.. ఈ మధ్య సరైన సక్సెస్ లేక కాస్త వెనుకపడ్డ గోపిచంద్ ఈ ‘‘గౌతమ్ నంద’’ మీదనే ఆశలు పెట్టుకున్నాడు. గోపిచంద్ స్టైలిష్ లుక్, టీజర్ లతో కాస్త ఇంట్రస్ట్ కలిగించిన ‘‘గౌతమ్ నంద’’ ఆడియన్స్ ను సాటిస్ ఫై చేసిందా అనేది తెలుసుకుందాం.

కథేంటి?

చిన్నప్పటి నుంచి బిలియనీయర్ ఫ్యామిలీలో పెరిగిన గౌతమ్ (గోపిచంద్) కు కష్టం, ఆకలి అంటే ఏంటో తెలియకుండా పెరుగుతాడు. ఓసారి ఒక పబ్ లో వెయిటర్ అన్న మాటకు జ్ఞానోదయం కలిగి తన ఐడెంటిటీ తెలసుకోవాలనుకుంటాడు.ఇంతలో అచ్చం తనలాగే ఉన్న నంద (గోపిచంద్) ను చూస్తాడు.. నంద బస్తీ లో పుట్టి పెరిగి, డబ్బులకోసం ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఎలాగైన ధనవంతుడు కావాలనుకుంటాడు.. గౌతమ్..నంద ప్లేస్ లో వెళ్లి లైఫ్ అంటే ఏంటో తెలుకుందామని.. నందును తన ప్లేస్ కు వెళ్లమంటాడు. అయితే ఆ తర్వాత వీళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి..? దానివల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నది మిగతా కథ..

నటీనటుల పర్ఫార్మెన్స్:

గోపిచంద్ లుక్ స్టైలిష్ గా ఉంది. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ను చాలా బాగా చేశాడు. సాఫ్ట్ రోల్ కన్నా.. నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో మునుపటి విలనీ గోపిచంద్ కనిపించాడు.హీరోయిన్లు హన్సిక, కేథరిన్ లు గ్లామర్ కోసమే పనికొచ్చారు… కానీ పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలేం కావు. ముఖేష్ రుషి, సచిన్ కేద్కర్, చంద్రమోహన్ ఫర్వాలేదనిపించారు. వెన్నెల కిషోర్, చంటి తదితరులు నవ్వించడానికి ట్రై చేశారు.

టెక్నీషియన్ల పనితీరు:

టెక్నీషియన్లలో ముందుగా చెప్పుకోవాల్సింది సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గురించి. ప్రతి ఫ్రేమ్ ను చాలా రిచ్ గా చూపించాడు.‘‘బోలే రామ్’’ సాంగ్ లో అయితే కెమెరా పనితనం అద్భుతం. థమన్ పాటలు సోసో గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు.. ఎడిటింగ్ లో కొన్ని సీన్లు లేపేయ్యాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను లావిష్ గా తీసారు. సంపత్ నంది రాసిన డైలాగ్స్ బాగా పేలాయి.

ప్లస్ లు:

  1. గోపిచంద్ పర్ఫార్మెన్స్
  2. స్టైలిష్ మేకింగ్
  3. సినిమాటోగ్రఫీ

మైనస్ లు:

  1. రొటీన్ కథ
  2. లెంగ్త్
  3. ఆకట్టుకోని కథనం

విశ్లేషణ:

‘‘గౌతమ్ నంద’’ ఓ రొటీన్ యాక్షన్ ఎంటర్ టైనర్. సంపత్ నంది స్టైలిష్ మేకింగ్,గోపిచంద్ నటన,కెమెరా పనితనం బాగున్నాయి. ఇక మేకింగ్ మీద పెట్టిన దృష్టి దర్శకుడు కథ, కథనాలపై పెట్టివుంటే ఇంకాస్త మంచి సినిమా అయ్యుండేది. అయినప్పటికీ ‘‘గౌతమ్ నంద’’ మాస్ ఆడియన్స్ కు ఫర్వాలేదనిపించే చాన్స్ ఉంది. ఫస్టాఫ్ లో కన్నా సెకండాఫ్ లో కథ ఊపందుకుంటుంది. చివరి 20 నిమిషాలు సినిమా గ్రిప్పింగా సాగుతుంది. తద్వారా సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్ మరీ డిజప్పాయింట్ అవ్వకుండా కాస్త కన్వీన్స్ అవుతాడు. ఇక డ్యూయల్ రోల్ ఇంట్రస్టింగానే అనిపించినా. కొన్ని పేలవమైన సీన్లు సినిమాను పేస్ ను దెబ్బతీశాయి. కథ రొటీన్ యే అయినప్పడు స్క్రీన్ ప్లే అయినా పకడ్బందీగా రాసుకోవాల్సింది. కామెడీ పెద్దగా నవ్వించదు, ఫ్యామిలీ ఎమోషన్స్ మరీ ఆర్టిఫీషియల్ గా ఉంటాయి. ఇద్దరు హీరోయిన్లున్నా..బలమైన లవ్ ట్రాక్ ఉండదు. ఎ క్లాస్ ఆడియన్స్ కు ‘‘గౌతమ్ నంద’’ రొటీన్ ఫీల్ కలిగించినా.. బి,సి సెంటర్ ఆడియన్స్ కు మాత్రం ఫర్వాలేదనిపిస్తాడు. గోపించంద్ డబుల్ ట్రీట్, హీరోయిన్ల గ్లామర్, లావిష్ మేకింగ్ మాస్ జనాలకు నచ్చుతుంది..

రేటింగ్- 2.75/5

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy