రివ్యూ: గ్యాంగ్

gangరన్ టైమ్: 2 గంటల 18 నిమిషాలు

నటీనటులు: సూర్య,కీర్తి సురేష్,రమ్యకృష్ణ,కార్తీక్,నందా,కళయారసన్,తంబి రామయ్య,ఆర్.జె బాలాజీ తదితరులు

మ్యూజిక్: అనిరుధ్

సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణణ్

కథ: నీరజ్ పాండే

ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్

నిర్మాత: కె.ఇ జ్ఞానవేల్ రాజా

రచన : దర్శకత్వం: విఘ్నేష్ శివన్

రిలీజ్ డేట్: జనవరి 12,2017

ఇంట్రో

నీరజ్ పాండే హిందీలో తీసిన ‘‘స్పెషల్ 26’’ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.. మంచి కంటెంట్,థ్రిల్ ఉన్న కథను సౌత్ కు అనుగుణంగా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించి దానికి కమర్షియల్ టచ్ ఇచ్చి రీమేక్ చేశారు సూర్య అండ్ టీమ్.. ‘‘స్పెషల్ 26’’ సినిమాకు ప్రధాన బలమైన అక్షయ్ కుమార్ పాత్రలో సూర్య ఎంతవరకు మెప్పించాడు..? కమర్షియల్ గా ఎలా వర్కవుట్ అయిందో సమీక్షిద్దాం.

కథేంటి?

కథ:

ఈ కథ 1987 లో జరుగుతుంది..ఉత్తమ్ దాస్ (సూర్య) ఉద్యోగం కోసం ప్రయత్నించే ఒక సాధారణ వ్యక్తి. తనతో పాటు తన స్నేహితులు ఉద్యోగాలు రాకుండా బాధలు పడుతుంటారు..ఓ స్నేహితుడు తన చదువుకు సరైన జాబ్ రాలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటాడు.దానికి బాగా హర్ట్ అయిన ఉత్తమ్ ప్రభుత్వ వ్యవస్థలో నిజాయితీ లేదని గుర్తిస్తాడు. తన స్నేహితుడికి జరిగిన దుస్థితి మరెవరికి జరగరాదని ఓ కఠిన నిర్ణయం తీసుకుంటాడు..తను చేసిన ఆ పనివల్ల ఎంతమంది ఉద్యోగం లభించింది.

నటీనటుల పనితీరు:

ప్రతి పాత్రకు తనను తాను మౌల్డ్ చేసుకునే సూర్య ఈ మూవీలో కూడా తన ప్రతిభ కనబరిచాడు.. 1980 ల్లో జరిగే కథకు తగ్గట్టు తన ఆహార్యం అంతా పర్ఫెక్ట్ గా కుదరింది. తన స్క్రీన్ ప్రజెన్స్ తో సి.బి.ఐ ఆఫీసర్ పాత్రకు బలం చేకూర్చాడు..ఒరిజినల్ కన్నా ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పెంచారు కానీ పెద్దగా ఉపయోగం లేకపోయింది. కీర్తి సురేష్ బొద్దుగా కనిపించింది.పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే. రమ్యకృష్ణ పాత్ర సినిమాకు ప్లస్ అయింది.ఝాన్సీ రాణి పాత్రలో ఎంటర్ టైన్ చేసింది.స్పెషల్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ హీరో కార్తీక్ బాగా చేశాడు. నందా,కళయారసన్,తంబి రామయ్య,ఆర్.జె బాలాజీ తమ పరిధిమేర నటించారు.

టెక్నీషియన్స్ వర్క్:

సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది.1980 లో జరిగే కథకు తగ్గట్టు టింట్,కలర్ పర్ఫెక్ట్ గా కుదిరాయి.. ఆర్ట్ వర్క్ కూడా దానికి తగ్గట్టే బాగా డిజైన్ చేశారు.అనిరుధ్ పాటల్లో ‘‘చిటికె’’ సాంగ్ తప్ప మిగతావి ఆకట్టుకోవు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది.. డైలాగులు బాగున్నాయి..

ప్లస్ లు

1. సూర్య

2. రమ్యకృష్ణ

3. ఎంటర్ టైన్మెంట్

మైనస్ లు:

1. స్క్రీన్ ప్లే

2. డ్రామా

3. సెకండాఫ్

విశ్లేషణ:

‘‘స్పెషల్ 26’’ సీరియస్ సబ్జెక్ట్..ఎలాంటి ప్రీచింగ్ లేకుండా స్ట్రైట్ టు ది పాయింట్ నెరేట్ చేసి సక్సెస్ అయ్యారు..ఆద్యాంతం ఎంగేజింగ్ గా సాగుతుంది. ఇలాంటి కథను కమర్షియల్ హంగులతో సౌత్ కు తగ్గట్టు మార్చాలనుకోవడం మంచి ఐడియా..ఆ స్ట్రాటజీ లో కొంతవరకు సక్సెస్ అయిన ‘‘గ్యాంగ్’’ టీమ్ సెంటిమెంట్ ఎక్కువ ఇరికించడం, కమర్షియల్ లిబర్టీ తీసుకోవడం వల్ల కాస్త ఫెయిలయింది.సూర్య,రమ్యకృష్ణల పర్ఫార్మెన్స్,సినిమ ఫస్టాఫ్,కామెడీ వల్ల పాసైపోయింది.కానీ సెకండాఫ్ వచ్చేసరికి ఒరిజినల్ లో ఉన్నంత సీరియస్ నెస్,థ్రిల్ మూమెంట్ లు సరిగా పండకపోయేసరికి చప్పబడింది..యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ డిటెయిలింగ్,కొన్ని మార్పులు ఇంప్రెస్ చేస్తాయి.. స్క్రీన్ ప్లే పక్కాగా రాసుకుని ఉండుంటే బాగుండేది.నిరుద్యోగులకు జాబ్స్ రావడంలేదని ఇతను ఫేక్ సి.బి.ఐ ఆఫీసర్ గా మారటం అనేది అక్సెప్టెన్సీ గా లేదు.అలాగే క్లైమాక్స్ బలంగా లేకపోవడంతో ఓవరాల్ గా ఓ యావరేజ్ సినిమాగా అనిపిస్తుంది తప్ప ఓ ఆలోచన రేకెత్తించదు.
బాటమ్ లైన్ : వినోదం మేళవించిన తీరు బాగుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy