రివ్యూ: ఘాజీ

ghajiరివ్యూ: ఘాజీ    (ఫలించిన సంకల్ప బలం)

రన్ టైమ్: 2 గంటల 4 నిమిషాలు

నటీనటులు: రానా, కెకె మీనన్, అతుల్ కులకర్ణి, దివంగత ఓంపురి, తాప్సీ, సత్యదేవ, నాజర్, రవివర్మ, ప్రియదర్శి, భరత్ తదితరులు

సినిమాటోగ్రఫీ: మధి

కంప్యూటర్ గ్రాఫిక్స్: ఎవా మోషన్ స్టూడియోస్

సంగీతం: కె

నిర్మాణం: మాట్నీ సినిమాస్,పి.వి.పి బ్యానర్

ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్

స్టోరీ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి

రిలీజ్ డేట్:  ఫిబ్రవరి 17,2017

 

ఇంట్రో

‘‘ఘాజీ’’ సినిమా అనౌన్స్ అయిన దగ్గరనుంచి ‘‘ఇదేదో కొత్త టైటిల్ లా ఉంది’’ ‘‘దేని గురించి ఉంటుందో’’ ఈ సినిమా అనుకున్నారంత.. అయితే.. ఇది సముద్ర గర్భంలో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్దం అని చాలా మందికి తెలియదు.. 1971లో జరిగిన ఈ యుద్దాన్ని ఇప్పుడు తెరకెక్కించడం అంటే అంత ఈజీ కాదు.. అందులో ఒక కొత్త డైరెక్టర్ ఇలాంటి కథను హ్యాండిల్ చేయడం కత్తి మీద సాము లాంటి ప్రయత్నమే.. ‘‘బాహుబలి’’ తర్వాత రానా నటించిన ఈ మూవీని హిందీ,తమిళ,తెలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందించారు.. ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షిద్దాం.

కథేంటి?

పాకిస్థాన్ ఆర్మీ పశ్చిమ పాకిస్థాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) లో పోరాడుతున్న తమ సైనికులకు సహాయం చేయడానికి కరాచీలో ఉన్న నేవల్ బేస్ నుంచి బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి ‘ఘాజీ’ అనే సబ్ మెరైన్ ను పంపుతుంది. ఆ సబ్ మెరైన్ భారతీయ జలాల గుండా వెళ్లి మాత్రమే బంగ్లాదేశ్ ను చేరుకోవాలి. కానీ ఈ మధ్యలో బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న భారతీయ జలాలకు ఇండియాకు చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కాపలా కాస్తుంటుంది. కనుక ముందు దాన్ని కూల్చి ఆ తర్వాత బంగ్లాదేశ్ చేరుకోవాలని ప్లాన్ వేస్తారు..ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకొన్న ఇండియన్ నేవీ జలాంతర్గామి ఎస్ 21 ను సముద్రంలోకి పంపుతుంది. దాంతో ‘ఘాజి’ ముందుగా ఎస్ 21 ను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎస్ 21 తో పాటు విశాఖపట్టణ ఓడరేవుని కూడా పేల్చేసి ఆక్రమించుకోవాలనుకున్న పాకిస్థాన్ ఎత్తుగుడలను ”ఎస్ 21” సైనికులు ఎలా ఎదుర్కున్నారు? ఆ రెండిటి మధ్య యుద్ధం ఎలా సాగింది అన్నదే ఈ సినిమా కథ..

నటీనటుల పర్ఫార్మెన్స్:

కొత్త దర్శకుడితో ఇలాంటి చాలెంజ్ ఉన్న సబ్జెక్ట్ ను ఓకే చేసినందుకు ముందుగా రానా ను అభినందించాలి.. కమాండర్ అర్జున్ పాత్రలో పరిణితి చెందిన నటనతో ఆకట్టుకున్నాడు.. ఇక మరో కీలకమైన కెప్టెన్ రాణ్ విజయ్ సింగ్ పాత్రలో కె.కె మీనన్ అధ్బుతంగా నటించాడు.. ఫస్టాఫ్ లో తన వెర్సటైల్ పర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు.. ఇక అతుల్ కులకర్ణి ది కూడా మంచి రోల్.. తాప్సీకి పెద్ద ఇంపార్టెన్స్ దక్కలేదు.. వీళ్లతో పాటు సత్యదేవ, రవివర్మ, భరత్ రెడ్డి, ప్రియదర్శిలు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీమ్ వర్క్:

ఇలాంటి పీరియాడిక్ సినిమా తీయాలంటే టెక్నికల్ టీమ్ నుంచి మంచి సహకారం లభించాలి.. అందరూ మంచి ఔట్ పుట్ ఇవ్వటంతో సినిమా టెక్నికల్ గా హై స్టాండర్డ్ లో ఉంది.. మధి కెమెరా వర్క్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.. కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ కు ఎక్కడా వంక పెట్టలేం.. పాటలు లేని ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీ ఫీల్ ను క్యారీ చేసింది. ఎడిటింగ్ బాగుంది.. తెలుగు డబ్బింగ్ లో లోపాలున్నాయి..నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రిచ్ గా తెరకెక్కించారు..కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఇలాంటి సాహసోపేతమైన సినిమాను నిర్మించినందుకు ప్రొడ్యూసర్ ను అభినందిచాల్సిందే.

విశ్లేషణ:

సినిమా చూస్తున్నంత సేపు డైరెక్టర్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.. తొలి సినిమాతోనే ఇలాంటి ఒక.. ఎవరికీ పెద్దగా తెలియని పీరియాడిక్ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం,దాన్ని మూడు భాషల్లో తెరకెక్కించాలనుకోవడం డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి సంకల్పానికి కు హ్యాట్సాఫ్.. రిస్క్ తో కూడుకున్న ఈ ప్రాజెక్ట్ గురించి పక్కా రీసెర్చ్ తో పర్ఫెక్ట్ ఎక్సిక్యూషన్ తో ప్రజెంట్ చేసి వాహ్వా అనిపించాడు… సినిమా మొత్తాన్ని ఎంగేజింగ్ తీసి కట్టిపడేసాడు డైరెక్టర్. తనకు ఆర్టిస్టులు,టెక్నీషియన్లు,ప్రొడ్యూసర్ల నుంచి మంచి సహకారం లభించింది. సంకల్ప్ రెడ్డి నుంచి ఫ్యూచర్ లో మరిన్ని డిఫరెంట్ సినిమాలు ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.. ఇక ఇండియన్ నేవి హిస్టరీలో ఎవరికీ తెలియకుండా మిగిలిపోయిన ఈ స్టోరీని అందరూ అభినందిస్తారు. పాకిస్థాన్ తో యుద్ద సన్నివేశాలు ఉండటం, దేశభక్తికి సంబంధించిన సినిమా కావడంతో ఈ సినిమాతో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇక ఫస్టాఫ్ లో రానా,కెకె మీనన్ ల మధ్య కాన్ ఫ్లిక్ట్ బాగుంది కానీ.. వాళ్లిద్దరి మధ్య ఇంకా కొన్ని సీన్లు ఉంటే బాగుండేదనిపించింది.. ఇక రెగ్యులర్ కమర్షియల్ సినిమా తాలూకు ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలా ఉంటుందో చూడాలి.. అయితే.. తెలిసిన ఆర్టిస్టులు కావడం, నేషనల్ వైడ్ మార్కెట్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి కమర్షియల్ గా కూడా పాసయ్యే చాన్సుంది… దీనికి తోడు మౌత్ పబ్లిసిటీ డెఫనెట్ గా ఉండనే ఉంటుంది.. ఇవన్నీ పక్కనెడితే.. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు రావడం అరుదు..మరుగున పడిపోయిన మన భారతీయ నేవీ సైనికుల వీరగాథ ను ప్రతీ ఒక్కరూ తప్పకుండా చూసి తరించాల్సిందే..

రేటింగ్: 3.5/5

బాటమ్ లైన్: ఫలించిన “సంకల్ప” బలం

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy