రివ్యూ : జంబలకిడి పంబ

review'రన్ టైమ్: 2 గంటల 21 నిమిషాలు

నటీనటులు: శ్రీనివాస రెడ్డి, సిద్ది ఇద్నాని, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, హిమజ, తనికెళ్ల భరణి, రఘుబాబు తదితరులు

సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల

మ్యూజిక్ : గోపి సుందర్

నిర్మాతలు : రవి,జోజో. ఎన్. శ్రీనివాస రెడ్డి

దర్శకత్వం : మురళీ కృష్ణ (మను)

రిలీజ్ డేట్ : జూన్ 22,2018

కథ

వరుణ్ (శ్రీనివాస రెడ్డి), పల్లవి (సిద్ది ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. చిన్న చిన్న గొడవల కారణంగా విడాకులు తీసుకోవాలనుకుంటారు. పేరు మోసిన లాయర్ (పోసాని)ని కలుస్తారు. అప్పటివరకు 99 మందికి విడాకులిప్పించిన లాయర్.. వీళ్ల కేసుతో సెంచరీ కొట్టి రికార్డు బ్రేక్ చేయాలనుకుంటాడు. ఇంతలో అనూహ్యమైన సంఘటన జరుగుతుంది.. ఆ పరిణామాల వల్ల వరుణ్, పల్లవి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.? చివరికి విడాకులు తీసుకున్నారా లేదా అనేది సస్పెన్స్.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

కమెడియన్ గా తన టైమింగ్ తో సపరేట్ మార్కు క్రియేట్ చేసుకున్న శ్రీనివాస రెడ్డి.. ఈ సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టు నటించాడు కానీ లేడి పాత్రలో ఎబ్బెట్టు గా కనిపించాడు. లవర్ బాయ్ గా ఆడ్ గా కనిపించాడు. కమెడియన్ గా ఓకే కానీ మెయిన్ లీడ్ గా తనని చూడటం కష్టం. సిద్ది ఇద్నాని అయితే తన పాత్ర పరిధికి మించి నటించేసింది. హీరోయిన్ గా కూడా యావరేజ్ గా ఉంది. దయ్యం పాత్రలో పోసాని విసిగిందాడు. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ధన్ రాజ్, జబర్దస్త్ అప్పారావు, శకలక శంకర్ కామెడీ చేయడానికి ట్రై చేశారు. తనికెళ్ల భరణి, హిమజ, సుధ అలవాటైన పాత్రలు పోషించారు.

టెక్నికల్ పర్ఫార్మెన్స్:

సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ యావరేజ్ గా ఉంది. గోపిసుందర్ పాటల సంగతి అటుంచితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పేరుతో రణగొణ ధ్వనులు పుట్టించి హోరెత్తించాడు. ఇక ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూయ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ నీట్ గా లేదు. కట్లు కట్లుగా ఉంది. డైలాగులు అన్ని రొటీనే. ప్రతి రొటీన్ జోక్ కు నవ్వే అలవాంటుండే వాళ్లు తప్ప ఈ పంచ్ లకు ఎవ్వరికీ నవ్వు రాదు.

విశ్లేషణ:

‘జంబలకిడి పంబ’ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ కామెడీ ఫిల్మ్. అదే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మాత్రం ఆద్యంతం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కేవలం డివోర్స్ అనే చిన్న పాయింట్ తో దర్శకుడు మను ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం చూస్తుంటే సిల్లీగా అనిపిస్తుంది. ఆ పాయింట్ కు లాజిక్ లేని సీన్లు, ఇష్టం వచ్చిన స్క్రీన్ ప్లే తో కలగాపులగం చేసేశాడు. సినిమా స్టార్టయిన దగ్గరి నుంచే ఫలితం ఊహించేసేయొచ్చు. ట్విస్టులు ఏవో అనుకున్నారు గానీ.. అవి మరీ లాజిక్ లెస్ గా ఉండటం తో ఏమాత్రం ఎక్సయిట్ చేయవు. లాయర్ దయ్యంగా మారటమేంటో, వందో విడాకుల కేసు జంటను కలిపితేనే స్వర్గానికి ఎంట్రీ ఉంటుందని దేవుడు అనడమేంటో.. ఈ భార్య భర్తల ఆత్మలు ఎక్స్ చేంజ్ అవ్వటమేంటో.. ఆత్మలతో పాటు వాళ్ల డ్రస్సులు కూడా మారిపోతాయి. ఇలాంటి ఐడియాలు వచ్చినందుకు డైరెక్టర్ కు దండం పెట్టొచ్చు. కామెడీ పేరుతో ఏది పడితే అది ఇరికించేసి ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఓవరాల్ గా టైటిల్ చూసి ‘‘జంబలకిడి పంబ’’ కి వెళితే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు.

బాటమ్ లైన్ : పంబ రేగిపోతుంది జాగ్రత్త

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy