రివ్యూ: దువ్వాడ జగన్నాథం

DJ-FBరన్ టైమ్: 2 గంటల 36 నిమిషాలు

నటీనటులు: అల్లు అర్జున్,పూజా హెగ్డే, రావురమేష్,మురళీశర్మ, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, వెన్నెల కిషోర్,శత్రు తదితరులు

సంగీతం: దేవీశ్రీ ప్రసాద్

స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి,దీపక్ రాజ్

సినిమాటోగ్రఫీ: అయనాంకా బోస్

ఎడిటింగ్: చోటా కె ప్రసాద్

నిర్మాత: దిల్ రాజు,శిరీష్

రచన,దర్శకత్వం: హరీష్ శంకర్

రిలీజ్ డేట్: జూన్ 23,2017

 

ఇంట్రో:

సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీతో మళ్లీ స్టార్ హీరోతో సినిమా చేసే చాన్స్ కొట్టేసిన హరీష్ శంకర్ అల్లు అర్జున్ ను డిజె గా చూపించాడు..అటు సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు సినిమాలతో దూకుడు మీదున్నాడు బన్నీ. వీళిద్దరి కాంబినేషన్ లో అల్లు అర్జున్ బ్రహ్మణ యువకుడిగా కనిపించడం వంటివి సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ అంచనాలను ఎంతమేరకు డిజె అందుకున్నాడో సమీక్షిద్దాం.

కథేంటి?

బ్రాహ్మణ కుటుంబంలో వంటవాడు అయిన దువ్వాడ జగన్నాథం (అల్లు అర్జున్)కు చిన్నప్పటి నుంచి తన కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించలేడు. పెద్దయ్యాక డిజెగా మారి చిన్న చిన్న అన్యాయాలను అరికడతాడు. ఓ సమయంలో రొయ్యల నాయుడు (రావు రమేష్)కు చెందిన ఆగ్రో డైమండ్స్ వల్ల వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయనీ, జనాలకు సంబంధించిన 9 వేల కోట్లు సొమ్మును రొయ్యల నాయుడు దగ్గర ఉన్నాయని తెలిసి అతనికి ఎదురు తిరుగుతాడు. ఇక అతని నుంచి దువ్వాడ జగన్నాథం ఆ డబ్బు ఎలా రాబట్టాడు.. రొయ్యల నాయుడుపై ఎదురు తిరగడానికి రీజన్ ఏంటీ? లవ్ స్టోరి ఏంటి అనేది మిగతా స్టోరి.

నటీనటుల పర్ఫార్మెన్స్:

అల్లు అర్జున్ రెండు షేడ్స్ లో కనిపించి మరోసారి ఇంప్రెస్ చేశాడు. బ్రాహ్మణ యువకుడిగా తను మాట్లాడిన డిక్షన్,పండించిన కామెడీ సినిమాకు హైలైట్. డాన్సులు, ఫైట్లలో మునుపటి లాగానే ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఇక పూజా హెగ్డే సినిమాకు మరో ప్లస్.. తన గ్లామర్ తో హీట్ పెంచింది.. ఉన్నంతలో నటన పరంగా కూడా ఫర్వాలేదనిపించింది.. విలన్ గా రావు రమేష్ మరోసారి తనమార్కు పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.డిఫరెంట్ స్లాంగ్,గెటప్ తో ఎంటర్ టైన్మెంట్ పండిస్తూనే..విలనిజం చూపించాడు.. చంద్రమోహన్ చేసిన సెంటిమెంట్ క్యారెక్టర్ బాగా పండింది.క్లైమాక్స్ లో సుబ్బరాజు నవ్వులు పూయించాడు. మురళీశర్మ, వెన్నెల కిషోర్,తనికెళ్ల భరణి,పోసాని వాళ్లకు అలవాటైన పాత్రల్లో ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్ టీమ్ వర్క్:

అయనాకా బోస్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.. కమర్షియల్ సినిమాకు కావాల్సిన రిచ్ నెస్ బాగా కనిపించింది.. దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా మూడ్ కు తగ్గట్టు ఫర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది.దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కొత్తగా చెప్పేదేముంది.. సినిమా మొత్తం గ్రాండ్ గా ఉంది..దీపక్ రాజు,రమేష్ రెడ్డి ల స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ క్రిస్ప్ గా ఉన్నా.. సెకండాఫ్ లో వీక్ అయ్యింది.. హరీష్ శంకర్ తనమార్కు పంచ్ డైలాగులతో మరోసారి అదరగొట్టాడు.

ప్లస్ లు:

  1. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్
  2. హరీష్ శంకర్ డైలాగులు
  3. పూజా హెగ్డే గ్లామర్
  4. కామెడీ

మైనస్ లు:

  1. రొటీన్ స్టోరీ
  2. సెకండాఫ్ స్క్రీన్ ప్లే

విశ్లేషణ:

దువ్వాడ జగన్నాథమ్ మూవీ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్.. తమ సినిమా నుంచి ప్రేక్షకులు ఏం ఆశించాలో ట్రైలర్ల ద్వారా నే చూపించేసారు దర్శకనిర్మాతలు.. సినిమా ఆద్యాంతం ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. అయితే ప్రెడిక్టబుల్ స్టోరీ కావడం,సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే లోపాలు ఉండటం వల్ల మరీ రొటీన్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది..డైలాగ్ రైటర్ గా తన మార్కు పంచులతో విజిల్స్ కొట్టించిన హరీష్ శంకర్ డైరెక్టర్ గా సెకండాఫ్ లో కాస్త గాడితప్పాడనే చెప్పుకోవాలి.. అయితే సినిమాలో కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ ఉండటం,అల్లు అర్జున్ ఫర్ఫార్మెన్స్,పూజా హెగ్డే ఒలకబోసిన గ్లామర్ వల్ల ఈ డిజె ను బి.సి ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు.. డిఫరెంట్ సినిమాలను కోరుకునే ఆడియన్స్ కాస్త పెదవి విరిచే అవకాశం ఉంది.. ఓవరాల్ గా డి.జె రొటీన్ సినిమానే అయినా.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు గట్టిగానే రాబట్టే చాన్స్ ఉంది.. కమర్షియల్ సినిమాకు కావాల్సిన మసాలా వడ్డించాడు కాబట్టి..ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

బాటమ్ లైన్- కమర్షియల్ డి.జె

రేటింగ్: 3/5

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy