రివ్యూ: నక్షత్రం

reviewరన్ టైమ్: 2 గంటల 47 నిమిషాలు

నటీనటులు: సందీప్ కిషన్,సాయిధరమ్ తేజ్,రెజీనా,ప్రగ్యా,ప్రకాష్ రాజ్,తులసి,తనీష్,శివాజీ రాజా,జె.డి చక్రవర్తి తదితరులు

సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్‌ నారోజ్‌

మ్యూజిక్ : భీమ్స్‌, భరత్‌ మధుసూదన్‌, హరిగౌర

ఎడిటింగ్ : శివ వై ప్రసాద్‌

నిర్మాతలు: కె. శ్రీనివాసులు, ఎస్‌. వేణుగోపాల్‌, సజ్జు

రచన, దర్శకత్వం: కృష్ణవంశీ

రిలీజ్ డేట్: ఆగస్ట్ 4,2017

విశ్లేషణ:

‘‘నక్షత్రం’’ .. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఏ అంశంలోనూ ఇంప్రెస్ చేయలేకపోయాడు. అతని క్రియేటివిటీ నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం దగ్గరే ఆగిపోయిందేమో అనే డౌట్ కలుగుతుంది. ఈ సినిమాకు ముందు రామ్ చరణ్ తో తీసిన ‘గోవిందుడు అందరివాడేలే’’ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడనుకున్న కృష్ణ వంశీ ఇలాంటి నాసిరకం సినిమా తీస్తడని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు. ఔట్ డేటెడ్ కథ, కథనాలు, ఆర్టిస్టుల ఓవరాక్షన్, ఆకట్టుకోని మేకింగ్, నాసరికం ప్రొడక్షన్ వాల్యూస్ వెరసి ‘‘నక్షత్రం’’ టోటల్ గా మిస్ ఫైర్ అయ్యింది.

కథ విషయానికొస్తే.. ఓ దశలో ఈ సినిమా కథేంటో సరిగా అర్థంకాదు. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో క్లారిటీ లేదు. చిన్నప్పటి నుంచి నిజాయితీ గల పోలీసాఫీసర్ కావాలనుకుంటున్న హీరోకి అనుకోని సంఘటనలు ఎదరువుతాయి. ఆ తర్వాత టెర్రరిస్టులను అంతమొందించే కథగా మారుతుంది. అలెగ్జాండర్ అనే స్పెషల్ ఆఫీసర్ కోసం అందరు వెతుకుతుంటారు. దానితో పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్న హీరోకు లింక్ ఏంటి అనేది మిగతా కథ. ఇన్ని లేయర్లు ఉన్న ఈ కథ అర్థమవటానికి చాలా టైమ్ పడుతుంది. ఇక ఈ పాత చింతకాయ పచ్చడి కథకు ఆర్టిస్టులు అవసరానికి మించి నటించి విసిగిస్తారు. సహజంగా కృష్ణవంశీ సినిమాల్లో కాస్త లౌడ్ గానే యాక్ట్ చేసే నటీనటులు ఈ సారి కాస్త శృతిమించారు. సందీప్ కిషన్ కు తనలోని నటున్ని చూపించుకునే చాన్స్ ఈ సినిమా లో దక్కింది. ఇంటర్వెల్ సీన్ లో చేసిన నటన బాగుంది. హీరోయిన్లిద్దరూ గ్లామర్ ఒలకబోసేందుకే పనికొచ్చారు. పర్ఫార్మెన్స్ మాత్రం నిల్. సాయిధరమ్ తేజ్ కూడా ఇంప్రెస్ చేయలేకపోయాడంటే. క్యారెక్టర్లు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మంచి స్కోప్ ఉన్న ఆ రోల్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. నిజం చెప్పాలంటే తేజ్ ను సరిగా వాడుకోలేదు. ప్రకాష్ రాజ్, శివాజీ రాజా, తులసి ఓవర్ ది బోర్డ్ వెళ్లి విసుగు పుట్టిస్తారు.

ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాసిరకంగా ఉన్నాయి. పాటల్లో ఏ ఒక్కటి కూడా గుర్తు పెట్టుకునే లా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే రణగొణ ధ్వనులతో థియేటర్ దద్దరిల్లి పోతుంది. సినిమాటోగ్రఫీ అస్సలు బాగాలేదు. ఎడిటింగ్ లో లేపేయ్యాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. రిపీటెడ్ సీన్లు కూడా ఎక్కువున్నాయి. డైలాగ్స్ ఇంకా బాగా రాసుకోవల్సింది. ఓవరాల్ గా కృష్ణవంశీ తీసిన అన్నిసినిమాల్లోకల్లా ఇదే వీకెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. కొంతైనా క్రియేటివిటీ చూపిస్తాడనుకున్న కృష్ణవంశీ ఆడియన్స్ ఆద్యంతం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు.

బాటమ్ లైన్: చుక్కలు చూపించాడు

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy