రివ్యూ : నా నువ్వే

reviewరన్ టైమ్:  2 గంటల 05 నిమిషాలు

నటీనటులు : కళ్యాణ్ రామ్, తమన్నా, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, ప్రవీణ్, పోసాని, ప్రియదర్శి ఇతరులు

సినిమాటోగ్రఫీ : పి.సి శ్రీరామ్

మ్యూజిక్ : శరత్

సమర్పణ : మహేష్ కోనేరు

నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు,విజయ్ కుమార్ వట్టికూటి

దర్శకత్వం : జయేంద్ర

రిలీజ్ డేట్ : జూన్ 14, 2018

కథేంటి?

మీరా (తమన్నా) డెస్టినీని బాగా నమ్ముతుంది. వరుణ్ (కళ్యాణ్ రామ్)కు సంబంధించిన ఒక పుస్తకంలో ఆయన ఫొటో చూసిన తర్వాత నుంచి.. అంతా మంచే జరుగుతుంది. ఆ కారణంగానే అతన్ని లవ్ చేస్తుంది. కానీ వరుణ్ విధిరాత లాంటి వాటికి పూర్తిగా వ్యతిరేకం. తను మీరాను లవ్ చేయాలంటే ఒక డెస్టినీకు సంబంధించి ఒక కండీషన్ పెడతాడు. మరి ఆ కండీషన్ ఏంటి? వీళ్ళ ప్రేమకథ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేది మిగతా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

హీరో కళ్యాణ్ రామ్ లవర్ బాయ్ రోల్ లో కొత్తగా ఉన్నాడు. ఈ పాత్రకు అతను సూట్ అవ్వలేదు. తమన్నాతో రొమాంటిక్ సీన్లల్లో నటించేటపుడు ఇబ్బంది పడ్డాడు. సినిమా మొత్తంలో ఇంప్రెస్ చేసిందంటే తమన్నా అందమే. పి.సి కెమెరాలో ఇంకా గ్లామరస్ గా కనిపించింది. నటన బాగుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, పోసాని కామెడీ పండించడానికి ట్రై చేశారు. తనికెళ్ల భరణి, హేమ, ప్రియ తమకు అలవాటైన పాత్రల్లో నటించారు.

టెక్నికల్ టీం వర్క్ :

టెక్నికల్ గా సినిమా నీట్ గా ఉంది. సీనియర్ కెమెరామన్ పి.సి శ్రీరామ్ ఫోటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెమెరాలో సినిమాను అద్బుతంగా బంధించాడు. శరత్ ఇచ్చిన పాటల్లో రెండు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా గ్రాండ్ గా తీశారు. ఆర్ట్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉంది. డైలాగులు బాగున్నాయి.

విశ్లేషణ:

‘నా నువ్వే’ ఎమోషనల్ లవ్ స్టోరీ గా అనుకున్నారు కానీ.. పకడ్బందీ స్క్రీన్ ప్లే, పేలవమైన దర్శకత్వం వల్ల సరైన ఫీల్, ఎమోషన్ లేకుండాపోయాయి. పాయింట్ అనుకున్నప్పుడు ఎగ్జైట్ చేసుండచ్చు కానీ.. ట్రీట్ మెంట్ లోపం వల్ల ఆద్యంతం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. హీరోయిన్.. హీరో ఫొటో చూసి లవ్ చేయడం, దానిని హీరో రిజెక్ట్ చేయడం లాంటి కథ మనకు రియాలిటీకి దూరంగా అనిపిస్తాయి. సిద్దార్థ్ తో 180 సినిమా తీసిన జయేంద్ర మరోసారి నిరాశపరిచాడు. డెస్టినీ అంటూ కాస్త డిఫరెంట్ లవ్ స్టోరిని ప్రజెంట్ చేద్దామనుకున్నారు కానీ అదే డిస్టెనీ ఈ సినిమాను మాత్రం సేవ్ చేయలేకపోయింది. రాంగ్ కాస్టింగ్,  బలహీనమైన స్కీన్ ప్లే, దర్శకత్వలోపం బాగా కనిపిస్తోంది. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కొరవడింది. ఎమోషనల్ సీన్లు పండలేదు. కథ, కథనం, దర్శకత్వం అన్ని విభాగాల్లో జయేంద్ర ఫెయిలయ్యాడు. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్.. ఇలాంటి లవ్ స్టోరీలో ఇమడలేకపోయాడు. కొత్తగా ట్రై చేద్దామనుకున్న కళ్యాణ్ రామ్ ‘నానువ్వే’ మెప్పించలేకపోయింది.

బాటమ్ లైన్: విధి ఆడిన వింత ప్రేమ నాటకం

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy