రివ్యూ : నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా

Naa-Peru-Suryaరన్ టైమ్: 2గంటల 47నిమిషాలు

నటీనటులు: అల్లు అర్జున్, అనూ ఇమాన్యూయల్,  అర్జున్, శరత్ కుమార్, బోమన్ ఇరానీ, రావు రమేష్ ఇతరులు

సినిమాటోగ్రఫీ : రాజీవ్ రవి

మ్యూజిక్ : విశాల్ శేఖర్

నిర్మాతలు : లగడపాటి శిరీషా శ్రీధర్, నాగబాబు, బన్నీ వాసు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వక్కంతం వంశీ

రిలీజ్ డేట్ : మే 4, 2018

కథ :

సూర్య (అల్లు అర్జున్)కి చిన్నప్పటి నుంచే కోపం ఎక్కువ. ఏదైనా నచ్చకపోతే ఎవరినైనా ఎదిరిస్తాడు. 16 ఏళ్ల వయస్సులోనే నాన్నని ఎదిరించి వెళ్లిపోతాడు. ఆర్మీలో జాయిన్ అవుతాడు. అక్కడ కూడా అదే ప్రవర్తన కంటిన్యూ చేస్తాడు. అది నచ్చక ఆర్మీ చీఫ్ డిస్మిస్ చేస్తాడు. బతిమాలితే ఒక్క చాన్స్ ఇస్తాడు. తను ప్రవర్తన బాగున్నట్లు సైకియాట్రిస్ట్  దగ్గర సంతకం తీసుకు రమ్మంటాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని తిరిగి ఆర్మీలోకి వెళ్లాడా లేదా.. సూర్యలో మార్పు వస్తుందా.. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

ఈ సినిమాకు మెయిన్ హైలైట్ హీరో అల్లు అర్జున్. సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఆర్మీ సోల్జర్ గా అదరగొట్టాడు. తన మేకోవర్, అటిట్యూడ్, ఎమోషన్ అన్నింట్లో వేరియేషన్ చూపించాడు. తన కెరీర్ లో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. హీరోయిన్ అనూ ఇమాన్యూయల్ గ్లామర్ కే పరిమితమైంది. నటన కూడా యావరేజ్. తండ్రి పాత్రలో అర్జున్ రాణించారు. అల్లు అర్జున్, అర్జున్ సీన్లు ఎఫెక్టివ్ గా ఉన్నాయి. శరత్ కుమార్ విలన్ పాత్రలో మెప్పించాడు. చారు హాసన్, సాయికుమార్ కీలకమైన పాత్రలు పోషించారు. అన్వర్ గా చేసిన లగడపాటి విక్రమ్ ఇంప్రెస్ చేశాడు. నదియాకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. వెన్నెల కిషోర్, పోసాని కామెడీ ఓకే.

టెక్నికల్ వర్క్:

రాజీవ్ రవి కెమెరా పనితనం.. టెక్నికల్ గా ఓ హైలైట్. ఆర్మీ లొకేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో తన సినిమాటోగ్రఫీ హై స్టాండర్డ్స్ లో ఉంది. మ్యూజిక్ యావరేజ్ గా ఉంది. పాటల్లో ఒకట్రెండు ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుండాల్సింది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ టెర్రిఫిక్ గా కంపోజ్ చేశారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. వక్కంతం వంశీ రాసిన డైలాగులు విజిల్స్ వేయించాయి.

ప్లస్ లు:

… అల్లు అర్జున్ నటన

… సినిమాటోగ్రఫీ

… యాక్షన్ ఎపిసోడ్స్

… క్యారెక్టరైజేషన్స్

మైనస్ లు

… స్క్రీన్ ప్లే, దర్శకత్వం

… డ్రాగింగ్ సెకండాఫ్

విశ్లేషణ

‘నాపేరు సూర్య’ ఇంటెన్స్ ఉన్న దేశభక్తి సినిమా. ఈ కథకే కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. ఊర మాస్ సన్నివేశాలు. అల్లు అర్జున్ క్యారెక్టర్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. తన అగ్రెస్సివ్ పర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తాన్ని ఒక్కడే నడిపిస్తాడు హీరో.  ఒకట్రెండు సీన్లు మినహా ఫస్టాఫ్ అంతా సూపర్ ఫాస్ట్ గా సాగిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్లు బాగా వచ్చాయి. సెకండాఫ్ మొదలైన తర్వాత కాస్త స్లోగా ఉంటుంది. బన్నీ తన మెచ్యుర్డ్ పర్ఫార్మెన్స్ తో ప్రతి సీన్ నిలబెట్టాడు. ఇక స్టోరీ, పాత్రలు బలంగా రాసుకున్న డైరెక్టర్ వక్కంతం వంశీ.. దాన్ని తెరపై మరింత అందంగా చూపించలేకపోయాడు. స్క్రీన్ ప్లే లోపంతో సెకండాఫ్ సాగదీతగా ఉంటుంది. మదర్ సీన్ సరిగా కనెక్ట్ అవ్వలేదు. అలాగే చివర్లో దేశం కోసం చెప్పించిన డైలాగులు ఫోర్స్ డ్ అనిపిస్తాయి. లాస్ట్ సాంగ్ కూడా సినిమా స్పీడ్ కు అడ్డంగా మారింది. ఓవరాల్ గా ‘నా పేరు సూర్య’ డిజప్పాయింట్ మాత్రం చేయదు. సమ్మర్ లో మాస్ మసాలా మూవీ. అల్లు అర్జున్ కోసం ఒకసారి హ్యాపీగా చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy