రివ్యూ: నేనే రాజు నేనే మంత్రి

Nene Raju Nene Mantri Movie Poster Designsరన్ టైమ్: 2 గంటల 32 నిమిషాలు
నటీనటులు: రానా, కాజల్‌, కేథరిన్‌, తనికెళ్ల భరణి, శివాజీరాజా, నవదీప్‌, అజయ్‌, రచ్చ రవి, అశుతోష్‌ రానా, ప్రదీప్‌ రావత్‌, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
సినిమాటోగ్రఫి: వెంకట్‌ సి దిలిప్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి
రచన – దర్శత్వం: తేజ
సంస్థ: సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఫిల్మ్‌ ప్లానెట్‌
విడుదల: 11-08-2017

ఇంట్రో: తేజ డైరెక్షన్ లో తొలిసారి వచ్చిన పొలిటికల్ డ్రామా ఇది. ప్రేమ కథలతో తనేంటో నిరూపించుకున్న ఆయన.. సెకండ్ ఇన్నింగ్ ను గ్రాండ్ గా ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు. కొన్నేళ్లుగా హిట్ కోసం తపిస్తున్న తేజ.. ఈ సినిమాతో హిట్ ను అందుకున్నాడా.? బాహుబలి తర్వాత దాన్నుంచి బయటపడేందుకు రానా చేసిన ప్రయోగం సక్సెస్ టాక్ అందుకుందా..? లీడర్ లో క్లాస్ సీఎంగా కనిపించి ఆకట్టుకున్న రానా.. ఈ సినిమాలో మాస్ సీఎంను తలపించాడా..?

స్టోరీ: జోగేంద్ర(రానా), రాధ(కాజల్‌) అన్యోన్యంగా ఉంటారు. వారిద్దరిని చూసి అసూయపడని వారుండరు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ సంఘటన తీవ్ర దుఃఖాన్ని నింపుతోంది. దీంతో జోగేంద్ర.. తనేంటో నిరూపించుకునే పనిలో పడతాడు. అక్కడి నుంచి స్టోరీ మారుతుంది. ఇంతకూ సీఎం కుర్చీ వరకు ఎందుకు వెళ్లాడు.. అతని లక్ష్యం నెరవేరిందా లేదా?  అనేది ఆసక్తికరంగా ఉంటుంది.. తెరమీద చూడాలి.

టెక్నికల్ పాయింట్స్: డైరెక్టీవ్ పాయింట్ లో చెప్పాలంటే.. తేజ మంచి ప్రయత్నం చేశాడు. పాత్రల్ని తీర్చిదిద్దడంలో.. వాటిని ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తగా… అదుపుతప్పకుండా చూసుకున్నాడు. అతని ఇంటెలిజెన్సీ కనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సమకాలీన రాజకీయాలపై సెటరికల్ గా ఉన్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం, వెంక‌ట్ సి. దిలీప్ ఛాయాగ్ర‌హ‌ణం, ల‌క్ష్మీభూపాల్ మాట‌లు క‌థ‌ను మ‌రోస్థాయికి తీసుకెళ్లాయి. ద‌ర్శ‌కుడిగా తేజ త‌న మార్క్‌ని చూపించాడు. క

నటీనటులు: రాధా-జోగేంద్ర‌లుగా అద్భుతంగా చేశారు కాజ‌ల్‌, రానా. బాహుబలి భళ్లాలదేవను మరిపించేలా రానా చేశాడంటున్నారు విమర్శకులు. కేథ‌రిన్ కూడా తన పాత్రకి న్యాయం చేసింది. జయప్రకాశ్ రెడ్డి, పోసాని, సత్యప్రకాశ్, నవదీప్, ప్రభాస్ శీను,  అశుతోష్ రానా, ప్ర‌దీప్‌రావ‌త్‌ పాత్రలకు తగ్గట్టు చేశారు.

ప్లస్ లు:
.. క‌థ‌, కథనం
.. క్యారెక్టరైజేషన్
.. డైలాగ్స్

మైనస్ లు:
.. సాగదీసిన క్లైమాక్స్

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy