రివ్యూ: మెంటల్ మదిలో

reviewరన్ టైమ్: 2 గంటల 30 నిమిషాలు

నటీనటులు: శ్రీ విష్ణు, నివేథా పెతురాజ్, అమృత, శివాజీ రాజా, కిరీటి, అనితా చౌదరి తదితరులు

మ్యూజిక్: ప్రశాంత్.ఆర్.విహారి

సినిమాటోగ్రఫీ: వేదా రమణ్

ఎడిటర్: విప్లవ్

నిర్మాత: రాజ్ కందుకూరి

రచన,దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

రిలీజ్ డేట్: నవంబర్ 24,2017

రీసెంట్ గా ‘‘పెళ్లి చూపులు’’ తరహాలోనే ‘‘మెంటల్ మదిలో’’ అనే సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది.కారణం ‘‘పెళ్లి చూపులు’’ నిర్మాతే ఈ సినిమాను కూడా నిర్మించడం.ఆ సినిమాను సపోర్ట్ చేసిన పెద్ద నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను కూడా రిలీజ్ చేయడం.ఇక ఆ సినిమా రిలీజ్ కు ముందే ప్రీమియర్ షోలు వేసినట్టే ‘‘మెంటల్ మదిలో’’ కు కూడా షోలు వేయడం. దీంతో ‘‘పెళ్లి చూపులు’’ కు వచ్చిన ఇంప్రెషన్ ఈ మూవీకి కూడా క్రియేట్ అయ్యింది. అదే ట్రెండ్ ను ఈ సినిమాకు కూడా ఫాలో అయి ప్రమోషన్ భాగంలో మళ్లీ సక్సెస్ అయ్యారు నిర్మాతలు.. మరి రిజల్ట్ లో కూడా ‘‘పెళ్లి చూపులు’’ మ్యాజిక్ ను ‘‘మెంటల్ మదిలో’’ చేసిందో లేదో సమీక్షిద్దాం.

కథేంటి?

చిన్నప్పటి నుంచి ఏదేని ఆప్షన్స్ ఇస్తే సరిగా చూజ్ చేసుకోలేక కన్ఫ్యూజ్ అవుతుంటాడు అరవింద్ కృష్ణ(శ్రీ విష్ణు).ఏదీ సరిగా డిసైడ్ అవ్వక ఇబ్బందిపడుతుంటాడు.ఇలాంటి వాడికి పెళ్లి సంబంధాలు ఎలా సెట్ చేయాలో అర్థంకాదు పేరెంట్స్ కి. ఫైనల్ గా స్వేఛ్చ (నివేతా) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు.ఆమె కూడా ఇతగాడి సమస్యను అర్థం చేసుకుని సహాయపడుతుంది..ఎంగేజ్ మెంట్ కు ముందే బాగా కలిసి పోతారు.ఓకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.త్వరలో ఎంగేజ్ మెంట్ కావాల్సి ఉండగా.. ప్రాజెక్ట్ వర్క్ కోసం ముంబై వెళ్లిన అరవింద్ నుంచి కొన్ని రోజుల తర్వాత మార్పు కన్పిస్తుంది.ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుందామంటాడు.అంతలా తను మారిపోవడానికి రీజన్ ఏంటి? చివరికి వీళ్ల పెళ్లి జరుగుతుందా లేదా అనేది కథ.

శ్రీవిష్ణు నటుడిగా ఆల్రెడీ ప్రూవ్ డ్.ఇలాంటి టైలర్ మేడ్ క్యారెక్టర్ లో చాలా సహజంగా నటించి ఆకట్టుకున్నాడు.మెయిన్ హీరోయిన్ నివేతా పెతురాజ్ కు ఎక్కువ మార్కులు పడతాయి.తను కూడా పక్కింటి అమ్మాయిల కనిపించి ఇంప్రెస్ చేస్తుంది.మరో హీరోయిన్ అమృత  విసగిస్తుంది.తన క్యారెక్టర్ కూడా అలాగే ఉండటం వల్ల మరీ ఓవర్ గా అనిపిస్తుంటుంది. ఫ్రెండ్లీ ఫాదర్ రోల్ లో శివాజీ రాజా బాగా ఎంటర్ టైన్ చేశాడు.చాలా రోజుల తర్వాత ఆయనకు మంచి క్యారెక్టర్ దక్కింది.హీరోయిన్ తల్లి పాత్రలో అనితా చౌదరి నటన బాగుంది.సపోర్టింగ్ రోల్ లో నటించిన కిరీటి ఫర్వాలేదనిపించాడు.

టెక్నీషియన్స్ లల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ గురించి.. తను ఇచ్చిన పాటల్లో రెండు బాగున్నాయి.అన్నీ సిట్యూయేషనల్ సాంగ్సే.. పాటల కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు.సినిమా మూడ్ కు తగ్గట్టు ఆర్.ఆర్ ఇచ్చి సినిమాకు ప్లస్ అయ్యాడు.. ఇలాంటి సినిమాకు నీట్ గా ఉండాల్సిన సినిమాటోగ్రఫీ మాత్రం డిజప్పాయింటింగ్ గా ఉంది.. చాలా క్లోజప్ షాట్స్ ఉన్నాయి.బస్ లో జరిగే సీన్ అయితే ఇబ్బందిగా అనిపిస్తుంది.. సెకండాఫ్ లో బోరింగ్ పార్ట్ కొంత ఎడిట్ చేయాల్సింది. చిన్న సినిమానే అయినప్పటికీ నిర్మాణ విలువలు తగిన స్థాయిలో లేవు.. టెక్నికల్ గా ఇంతకన్నా మంచి ఔట్ పుట్ ఇచ్చిన చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. డైలాగులు బాగా రాసుకున్న వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లే విషయంలో,సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ లో కేర్ తీసుకోవాల్సింది.

ప్లస్ లు

  1. శ్రీవిష్ణు,నివేతా ల నటన
  2. ఫస్టాఫ్
  3. మ్యూజిక్

మైనస్ లు:

  1. సెకండ్ హీరోయిన్
  2. సెకండాఫ్ లో మొదటి 30 నిమిషాలు
  3. సినిమాటోగ్రఫీ

అంతా యంగ్ టెక్నీషియన్స్ తో చేసిన ‘‘మెంటల్ మదిలో’’ మేజర్ పార్ట్ వరకు మెప్పిస్తుంది.కథ రొటీనే అయినా..హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమా నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.లీడ్ క్యారెక్టర్ కు ఉండే ఓ కామన్ ప్రాబ్లమ్ తో తన లవ్ లైఫ్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు అనే పాయింట్ ను ఆహ్లాదంగా మలిచి దాదాపు సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.కొత్తవాడే అయిన మంచి రైటింగ్ తో బాగా హ్యాండిల్ చేశాడు.అయితే సెకండాఫ్ లో లోపాలుండటం ఈ సినిమాకు మైనస్..హీరో,హీరోయిన్ల క్యారెక్టర్లను బలంగా రాసుకుని ఫస్టాఫ్ ను ప్లజెంట్ గా ప్రజెంట్ చేసిన వివేక్..సెకండాఫ్ లో ఇంకో హీరోయిన్ రూపంలో వచ్చే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో ‘‘మెంటల్ మదిలో’’ కాసేపు మెంటలెక్కించేస్తుంది..ఆ పాత్ర కన్వీన్సింగ్ గా లేదు..మళ్లీ క్లైమాక్స్ ను బాగా డీల్ చేయడం వల్ల ప్రేక్షకులు సాటిస్ ఫై అవుతారు.సెకండాఫ్ ను కూడా ఫస్టాఫ్ లాగా గ్రిప్పింగ్ గా ఉండి ఉంటే ఈ సినిమా కూడా మరో ‘‘పెళ్లి చూపులు’’ లాంటి సినిమా అయ్యుండేది..ఫక్తు క్లాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమా అయిన ‘‘మెంటల్ మదిలో’’ మాస్ జనాలకు అంతగా రుచించకపోవచ్చు. ఓవరాల్ గా కొత్త వాళ్ల నుంచి ఇలాంటి ప్రయత్నం మెచ్చుకోదగ్గదే అయినా..సెకండాఫ్ పర్ఫెక్ట్ గా ఉండి ఉంటే ‘‘మెంటల్ మదిలో’’ ప్రేక్షకుల మదిని పూర్తిగా దోచుకునేది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy