రివ్యూ: మెహబూబా

mehabobaరన్ టైమ్: 2 గంటల 32 నిమిషాలు

నటీనటులు: ఆకాష్ పూరీ, నేహా శెట్టి, మురళీ శర్మ, షియాజీ షిండే, విషు రెడ్డి తదితరులు

సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ

మ్యూజిక్ : సందీప్ చౌతా

ప్రొడ్యూసర్ : పూరీ కనెక్ట్స్

రచన, దర్శకత్వం : పూరీ జగన్నాథ్

రిలీజ్ డేట్ : మే 11, 2018

కథేంటి?

రోషన్ (ఆకాష్ పూరి)కి దేశభక్తి ఎక్కువ. ఆర్మీలో చేరాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అతన్ని గత జన్మ తాలూకు ప్రేమ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. అలాంటి సమయంలోనే అతను హిమాలయాలకు ట్రెక్కింగ్ కు వెళ్లగా తన గత జన్మ ప్రేమ గురించి తెలుస్తుంది. గత జన్మలోని ప్రేయసి ఈ జన్మలో అఫ్రిన్ (నేహా శెట్టి)గా పుట్టిందని, ఆమె పాకిస్థాన్ లో ఉందని గ్రహించి ఆమె కోసం  అక్కడికి వెళతాడు. గత జన్మలో కోల్పోయిన ప్రేమను ఈ జన్మలో పొందటానికి ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాడనేదే కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

పూరీ ఆకాష్ హీరోగా మొదటి సినిమానే అయినా.. కాన్ఫిడెంట్ గా నటించాడు. ఎమోషన్, యాక్షన్ సీన్లలో బాగా చేశాడు. ఫ్యూచర్లో ప్రామిసింగ్ హీరో అవుతాడు. హీరోయిన్ నేహా శెట్టి పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. సాడ్ క్యారెక్టర్ కాబట్టి నటించడానికి పెద్దగా స్కోప్ లేకుండాపోయింది. విలన్ గా చేసిన విషు రెడ్డి ఓకే. షియాజీ షిండే మురళీ శర్మ, అశ్విని కలేస్కర్ అలవాటైన పాత్రల్లో రాణించారు.

టెక్నిషియన్స్ వర్క్ :

విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సినిమాకే బలం. ఈ మధ్య వచ్చిన పూరీ జగన్నాథ్ సినిమాల్లో విజువల్ పరంగా ఇదే బెస్ట్. సందీప్ చౌతా ఇచ్చిన పాటల్లో టైటిల్ సాంగ్ తప్ప ఏదీ బాగాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగోలేదు. ఎడిటింగ్ టేబుల్ మీద కత్తెర పడాల్సిన సీన్లున్నాయి. డైలాగ్ రైటర్ గా పూరీ మరోసారి రాణించాడు. సేవ్ టైగర్ క్యాంపెన్ గురించిన సీన్లో, ప్రీ క్లైమాక్స్ లో పాకిస్థాన్, ఇండియా గురించి చెప్పే సీన్లో పూరీ డైలాగులు ఎఫెక్టివ్ గా ఉన్నాయి.

విశ్లేషణ:

ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ మిస్ ఫైర్ అయ్యిందనే చెప్పాలి. పాయింట్ ఇంట్రస్టింగ్ గానే ఉన్నా నెమ్మదైన కథనం.. సీన్లల్లో ఎమెషన్ లేకపోవడంతో నిరుత్సాహ పరుస్తోంది. డైలాగ్ రైటర్ గా అలరించిన పూరీ.. డైరెక్టర్ గా విఫలం అయ్యాడు. ఈ మధ్య ఆయన తీస్తున్న సినిమాల్లో మునుపటి కసి కనిపించడం లేదు. సొంత కొడుకును హీరోగా పెట్టి తీసిన ఈ మూవీ అయినా మళ్లీ ఫామ్ లోకి వస్తాడు అనుకుంటే అదీ లేకుండా పోయింది. ఆర్మీ కథ కాబట్టి అక్కడ తీసిన కొన్ని సీన్లు లాజిక్ కు దూరంగా ఉన్నాయి. హీరో పాకిస్థాన్ బోర్డర్ దాటే సీన్ మరీ సిల్లీగా అనిపిస్తుంది. క్లయిమాక్స్ ఫైట్ కూడా కామెడీ గా అనిపిస్తుంది. అంత కష్టపడి లవ్ స్టోరీ తీయలన్న పూరీ ఆలోచన బాగానే ఉన్నా.. దాన్ని ఎక్స్ క్యూట్  చేయడంలో ఫెయిలయ్యాడు. అక్కడక్కడా సీన్లు మినహాయిస్తే..‘మెహబూబ’ నిరాశపరుస్తుంది.

బాటమ్ లైన్ : పూరీ నుంచి మరో మిస్ ఫైర్

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy