రివ్యూ: రాజా ది గ్రేట్

raja-the-great-reviewరన్ టైమ్: 2 గంటల 49 నిమిషాలు

నటీనటులు: రవితేజ, మెహరీన్, రాధిక, ప్రకాష్ రాజ్, సంపత్, వివన్, శ్రీనివాసరెడ్డి, పోసాని, తనికెళ్ల భరణి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు

సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ

మ్యూజిక్: సాయి కార్తీక్

ఎడిటింగ్: తమ్మిరాజు

నిర్మాత: దిల్ రాజు

రచన,దర్శకత్వం: అనిల్ రావిపూడి

రిలీజ్ డేట్: అక్టోబర్ 18,2017

పటాస్,సుప్రీమ్ సినిమాల్లో కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ ను అందించి కమర్షియల్ డైరెక్టర్ గా మంచి మార్కులు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తన మూడో సినిమాగా రవితేజతో ‘‘రాజా ది గ్రేట్’’ చేశాడు.. ఈ కథలో హీరో అంధుడు కావడం డిఫరెంట్ పాయింట్..అయితే స్టోరీ మాత్రం రెగ్యులరే.. అయినప్పటికీ అనిల్ రావిపూడి తన దగ్గరున్న అన్ని కామెడీ అస్త్రాలన్నీ వాడి టైమ్ పాస్ సినిమాగా దీన్ని మలచాడు.. లాజిక్ లు కొన్ని మినహాయిస్తే ఈ సినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

కథగా చెప్పుకుంటే ఇది చాలా రొటీన్.. తన తమ్ముడిని చంపాడని..పోలీసాఫీసర్ కూతురిపై రివేంజ్ తీర్చుకోవలనుకుంటాడు విలన్.. ఆమెను విలన్ నుంచి కాపాడేందుకు పోలీస్ టీమ్ బ్లైండ్ అయిన హీరోను అపాయింట్ చేస్తుంది. విలన్ కు బుద్ది చెప్పి హీరోయిన్ ను ఎలా సేవ్ చేసాడన్నదే స్టోరి.. చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్న ఈ స్టోరీని అనిల్ రావిపూడి కామెడీతో పాస్ చేయించాడు. అయితే హీరోను అంధుడిని చేశాడు కానీ..కొన్ని చోట్ల కనీసమైన లాజిక్ లు వదిలేసి హీరోతో భారీ ఫీట్స్ చేయించాడు.. దానికి హీరో ట్రయిన్డ్ అని చెప్పించినా..అంతగా నమ్మబుల్ గా అనిపించదు.

దాదాపు రెండేళ్ల తర్వాత మేకప్ వేసుకున్న రవితేజ అదే ఎనర్జీతో కనిపించాడు. బ్లైండ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు..మెహరీన్ మరీ బొద్దుగా ఉంది. నటన విషయంలో ఏమాత్రం ఆకట్టుకోలేదు.రాధిక నటన బాగుంది.తనికెళ్ల భరణి క్యారెక్టర్ భలే పేలింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో శ్రీనివాసరెడ్డి మెప్పించాడు ప్రకాష్. సంపత్, పోసాని, రాజేంద్ర ప్రసాద్, పృథ్వీ తమ పరిధిలో బానే చేశారు.విలన్ గా చేసిన వివన్ అతి చేశాడు.

టెక్నీషియన్స్ లో సినిమాటోగ్రఫర్ మోహన్ కృష్ణ పనితనం బాగుంది.సాయి కార్తీక్ ఇచ్చిన పాటల్లో టైటిల్ సాంగ్ తప్ప అన్నిఅంతంత మాత్రంగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా లౌడ్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువున్న ఈ సినిమాలో ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది.యాక్షన్ ఎపిసోడ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.ఆర్ట్ వర్క్ బాగుంది.

కమర్షియల్ సినిమా కథలో హీరో అంధుడైతే ఎలా ఉంటుంది.. దాని నుండి ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ రాబట్టవచ్చు అనే పాయింట్ బాగానే ఉన్నా.. మరీ సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకొని ఓవర్ ది బోర్డ్ వెళ్లాడు అనిల్ రావిపూడి. అయితే కావాల్సినంత వినోదం ఉండేలా చూసుకోవడం వల్ల ఆడియన్స్ ఎంటర్ టైన్ అవుతారు.. ప్రతి సినిమాలో హిలేరియస్ కొన్ని మూమెంట్స్ ఉండేలా చూసుకునే అనిల్..ఇందులో కూడా 4,5 ఎపిసోడ్స్ గట్టిగా పేలేలా జాగ్రత్తపడ్డాడు.. ఫస్టాఫ్ లో కబడ్డీ ఫైట్, బ్యాంక్ రాబరీ సీన్,సెకండాఫ్ లో ‘‘గున్నా గున్నా మామిడి’’ సాంగ్ బిట్,విలన్ ను పిలిచి వార్నింగ్ ఇచ్చే సీన్ లు గట్టిగా పేలాయి.. ఇక మిగతా పంచ్ లు,హీరో ఎనర్జీ,మ్యానరిజం అన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి.ఫస్టాఫ్ సరదాగా సాగిపోయిన ‘‘రాజా ది గ్రేట్’’ లో సెకండాఫ్ ల్యాగ్ అయిన ఫీల్ కలుగుతుంది.. సినిమా అంతా అయిపోయిందనుకున్న తరుణంలో మరో సీన్,సాంగ్ వస్తుంది.నిజానికి ఆ ఎపిసోడ్ అనవసరం..అదేమంత ఆకట్టుకోలేదు కూడా…ఇక మదర్ ను సేవ్ చేసే ఎపిసోడ్ కూడా అతిగా అనిపిస్తుంది.. డిఫరెంట్ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నారు కానీ..కథ,కథనం,టేకింగ్ లలో ఇంకాస్త కొత్తదనం చూపించి ఉంటే ఈ రాజా నిజంగానే గ్రేట్ అనిపించుకునేవాడు..

కొన్ని లాజిక్ లు పక్కనెట్టి టైమ్ పాస్ కోసం వెళితే మాత్రం ఈ ‘‘రాజా ది గ్రేట్’’ మూవీ ఎంటర్ టైన్ చేస్తుంది.. ‘‘ఏ’’ క్లాస్ ప్రేక్షకులకు నాట్ సో గ్రేట్ అనిపించే ఈ రాజా బి.సి సెంటర్ ఆడియన్స్ టికెట్ డబ్బులకు న్యాయం చేస్తాడు.

బాటమ్ లైన్: టైమ్ పాస్ రాజా

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy