రివ్యూ: రాజు గారి గది 2

Raju-Gari-Gadhi-2-Movie-Reviewనటీనటులు: నాగార్జున, సమంత, రావు రమేష్, అశ్విన్, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, నరేష్, శకలక శంకర్, అభినయ, నందు ఇతరులు

సినిమాటోగ్రఫీ-ఆర్.దివాకరణ్

మ్యూజిక్: ఎస్.ఎస్ థమన్

కథ: రంజిత్ శంకర్

మాటలు: అబ్బూరి రవి

నిర్మాతలు: పి.వి.పి, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్,ఓక్ ఎంటర్ టైన్మెంట్స్

స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ఓంకార్

రిలీజ్ డేట్: అక్టోబర్ 13,2017

ఐదేళ్ల నుంచి హార్రర్ కామెడీ జానర్ తెలుగులో సక్సెస్ అవుతూ వస్తోంది. ఆ జానర్ లో రెండేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ రాజు గారి గది. ఈ సినిమాతో ఓంకార్ సత్తా ఏంటో తెలిసింది. అందుకే లేట్ చేయకుండా అదే సక్సెస్ ఫార్మూలా ను కంటిన్యూ చేస్తూ దానికి సీక్వెల్ గా ‘‘రాజు గారి గది 2’’ అనౌన్స్ చేశారు. నాగార్జున, సమంత లాంటి స్టార్స్ సినిమాలో నటించటంతో క్రేజ్ తో పాటు అంచనాలు పెరిగాయి. అంచనాలను మించకపోయినా.. నాగ్, సమంత యాక్టింగ్ తో రాజు గారి గది 2 పాసైపోయింది.

ఈ మూవీలో ఎమోషన్ ను నమ్ముకున్నాడు డైరెక్టర్ ఓంకార్. కామెడీ పండించడంలో, భయపెట్టడంలో అంతగా సక్సెస్ కాలేదు. కథ అంతా సెకండాఫ్ లో ఉంది కాబట్టి ఫస్టాఫ్ కామెడీ తో నడిపించేద్దాం అనుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్ తో చేసిన కామెడీ మరీ ఎక్కువ అయినట్లు అనిపిస్తోంది. మొదటి 40 నిమిషాల తర్వాత నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మొదలవుతోంది. ప్రేక్షకుడు కూడా కథలోకి ఎంటర్ అయ్యాం అన్న ఫీలింగ్ లోకి వస్తాడు.

నాగార్జున క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంది. మెంటలిస్ట్ పాత్రలో సూటయ్యాడు. ఆయన సీన్లు బలంగా రాసుకున్నాడు ఓంకార్. సమంత కూడా సినిమాకు ప్లస్ అయింది. ఒక స్టార్ హీరోయిన్ ఇలాంటి ఇంపార్టెన్స్ ఉన్న చిన్న పాత్ర చేయడం అభినందనీయం. ఆ క్యారెక్టర్ బాగా చేసింది. సీరత్ కపూర్ గ్లామర్ ఫుల్. యాక్టింగ్ నిల్. వెన్నెల కిషోర్,ప్రవీణ్ లు నవ్వించే ప్రయత్నం చేశారు. శకలక శంకర్ ను ఇంకా వాడుకోవాల్సింది. అశ్విన్ ది పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. రావు రమేష్, అభినయ మెప్పించారు.

సినిమా కథ, కథనాల కన్నా టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉంది. అది ప్లస్ అయింది. ఇలాంటి సినిమాలకు చాలా ఇంపార్టెంట్ అయిన మ్యూజిక్, గ్రాఫిక్స్ వర్క్, సినిమాటోగ్రఫీ విభాగాల నుంచి మంచి ఔట్ పుట్ వచ్చింది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అధ్బుతంగా ఉంది. సౌండ్ డిజైన్ ఎఫెక్టివ్ గా ఉంది. గ్రాఫిక్స్, దివాకరణ్ కెమెరా వర్క్ టాప్ నాచ్.. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు.. అబ్బూరి రవి రాసిన డైలాగులు మెప్పిస్తాయి.

ఓంకార్ చెప్పాలనుకున్న సెన్సిబుల్ పాయింట్ బాగున్నా.. కథనంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సింది. రాజు గారి గది లా ఉంటుందేమో అని ఆడియన్స్ వస్తే మాత్రం కాస్త డిజప్పాయింట్ అవుతారు. అక్కడ పండినంత కామెడీ, హార్రర్  ఇందులో పండలేదు. కాకపోతే చివరి 30 నిమిషాల్లో ఎమోషన్ బాగా పండింది. అదే సినిమాను నిలబెట్టింది. ఈ మధ్య ఇంటర్నెట్ లీకేజీల వల్ల అమ్మాయిల జీవితం ఎలా అవుతుందనే పాయింట్ తీసుకోవడం బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే ఇంటరాగేషన్ ఎపిసోడ్ బాగా రాసుకున్నాడు ఓంకార్. మూడు క్యారెక్టర్ పై అనుమానం క్రియేట్ చేసి.. ఎవ్వరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇవ్వడం బాగుంది. ఓవరాల్ గా ‘‘రాజు గారి గది 2’’ డీసెంట్ హార్రర్ థ్రిల్లర్. మరీ ఎక్స్ పెక్ట్ చేసినంత లేకపోయినా.. నాగార్జున, సమంత అప్పీయరెన్స్, మ్యూజిక్, గ్రాఫిక్స్ తో పెట్టిన టికెట్ డబ్బులకు న్యాయం జరుగుతుంది..

బాటమ్ లైన్: ఎమోషనల్ థ్రిల్లర్

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy