రివ్యూ : రారండోయ్ వేడుక చూద్దాం

kalyanరివ్యూ: రారండోయ్ వేడుక చూద్దాం – రొటీన్ వేడుక

రన్ టైమ్: 2 గంటల 30 నిమిషాలు

నటీనటులు: నాగచైతన్య, రకుల్, జగపతిబాబు, సంపత్ రాజ్, పృథ్వి, వెన్నెల కిషోర్  తదితరులు

మ్యూజిక్: దేవీశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్

ఎడిటింగ్: గౌతం రాజు

స్క్రీన్ ప్లే: సత్యానంద్

నిర్మాత: అక్కినేని నాగార్జున

కథ, మాటలు, దర్శకత్వం : కళ్యాణకృష్ణ కురసాల

ఇంట్రో:

నాగార్జున కు ‘‘సోగ్గాడే చిన్నినాయన’’ సినిమాతో మంచి సూపర్ హిట్ ఇచ్చాడు యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. చాలా రోజులుగా కొడుకు నాగచైతన్యకు కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగార్జున.. కళ్యాణ్ తో చేస్తే చైతుకి సక్సెస్ ఖాయమని భావించి ‘‘రారండోయ్ వేడుక చూద్దాం’’ సినిమా చేశారు. ట్రైలర్ తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ లా కనిపించిన ఈ మూవీ మరి చైతన్య కెరీర్ కు ఏ విధంగా ఉపయోగపడిందో తెలుసుకుందాం.

కథేంటి?

పల్లెటూల్లో గారాభం గా పెరిగిన భ్రమరాంబ (రకుల్ ప్రీత్) తనకు కాబోయే వాడు రాజకుమారుడు లా ఉండాలని కలలుకంటుంది. ఓ పెళ్లి లో ఆమె ను చూసి లవ్ లో పడతాడు శివ (నాగ చైతన్య) ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. భ్రమరాంబ కూడా తనకు తెలియకుండానే శివను ప్రేమిస్తుంది. భ్రమరాంబ తండ్రి ఆదికి (సంపత్ రాజ్), శివ తండ్రి కృష్ణ (జగపతి బాబు) అని తెలియడంతో పెళ్లి కుదరదని చెప్తాడు. దానికి కారణం ఏంటి..? అసలు కృష్ణ ఆది మధ్య వైరం ఎందుకొచ్చింది?

నటీనటుల పర్ఫార్మెన్స్:

నాగ చైతన్య హానెస్ట్ లవర్ రోల్ మెప్పించాడు. బీచ్ లో హీరోయిన్ తో బ్రేక్ అప్ చెప్పే సీన్లో బాగా చేశాడు. భ్రమరాంబ పాత్రలో హీరోయిన్ రకుల్ విసిగించింది. ఆమెకు ఈ ట్రెడిషనల్ లుక్ సూట్ అవ్వలేదు. నటనకు స్కోప్ ఎక్కువున్న ఈ పాత్ర లో రకుల్ తేలిపోయింది. వెన్నెల కిషోర్ కాస్త నవ్వించాడు. హీరో తండ్రి పాత్రలో జగపతిబాబు ఒదిగిపోయాడు. సంపత్ రాజ్ బాగా చేశాడు. రకుల్ తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ కౌసల్య నటించి ఫర్వాలేదనిపించింది. పెళ్లిలో పృథ్వి, సప్తగిరి, పోసాని కామెడి చికాకు తెప్పిస్తుంది.

టెక్నికల్ వర్క్:

విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వైజాగ్ లోకేషన్లను అందంగా చూపించాడు. పాటల పిక్చరైజేషన్, లైటింగ్ బాగుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఎడిటింగ్ బాగాలేదు. సినిమా లెంగ్త్ ఎక్కువైన ఫీల్ ఉంది. కొన్ని సీన్లకు కత్తెర పడాల్సింది. కళ్యాణ్ కృష్ణ రాసిన డైలాగులు బాగానే పేలాయి. సత్యానంద్ స్క్రీన్ ప్లే డల్ గా ఉంది.

ప్లస్ లు:

  1. సెకండాఫ్
  2. డైలాగ్స్
  3. మ్యూజిక్

మైనస్ లు:

  1. రొటీన్ స్టోరీ
  2. రకుల్ ప్రీత్
  3. ఫస్టాఫ్

విశ్లేషణ:

‘‘రారండోయ్ వేడుక చూద్దాం’’ ఒక రొటీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మనం కొన్ని ఏళ్ల నుంచి చూస్తోన్న ఫ్యామిలీ సినిమాలను గుర్తుకుతెస్తుంది. నిన్నే పెళ్లాడతా, మురారి సినిమా ఛాయలు కనిపిస్తాయి. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు నిడివి ఎంత క్రిస్ప్ గా ఉంటే అంత బాగుంటుంది. ఈ మూవీ లెంగ్తీగా సాగుతుంది. ఫస్టాఫ్ నిదానంగా సాగుతుంది. స్టోరీ మొత్తం సెకండాఫ్ లో రివీల్ అవుతుంది. దానివల్ల సినిమా సరైన ట్రాక్ లో పడినట్టు అనిపిస్తుంది. నాగచైతన్య బీచ్ లో బ్రేక్ అప్ చెప్పే సీన్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సరిగ్గా రాసుకోవడం వల్ల మూవీ ఫర్వాలేదనిపిస్తుంది. కళ్యాణ్ కృష్ణ డైలాగ్ రైటర్ గా ఇంప్రెస్ చేసినా.. డైరెక్టర్ గా విఫలమయ్యాడు. ‘‘సొగ్గాడే చిన్నినాయన’’ లాగే ఈ మూవీకి కూడా కాస్త ఎఫెక్టివ్ ట్రీట్ మెంట్ ఇచ్చినట్టయితే రిజల్ట్ వేరేలా ఉండేది. ఇక ఈ మధ్య కొత్తదనం కోరుకుంటున్న ఆడియన్స్ ఇలాంటి పాత చింతకాయ పచ్చడి లాంటి కథను ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారో అనేది తెలియాలి. సరదాగా టైంపాస్ కోసం ఈ సినిమాను ఒకసారికి ట్రై చేయవచ్చు. ఇక సమ్మర్ హాలిడేస్, వేరే సినిమా కాంపిటేషన్ లేకపోవడం వల్ల సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ రాబట్టే చాన్సుంది.

బాటమ్ లైన్ : రొటీన్ వేడుక

రేటింగ్ – 2.75/5

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy