రివ్యూ : విశ్వరూపం 2

రన్ టైమ్ : 2 గంటల 25 నిమిషాలు

నటీనటులు : కమల్ హాసన్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్, రాహుల్ బోస్, వహిదా రెహ్మాన్ తదితరులు

సినిమాటోగ్రఫీ: షామ్ దత్,సాను వెర్గసె

మ్యూజిక్: జిబ్రాన్

నిర్మాతలు: కమల్ హాసన్,చంద్ర హాసన్,ఆస్కార్ రవిచంద్రన్

రచన, దర్శకత్వం: కమల్ హాసన్

రిలీజ్ డేట్ : ఆగస్ట్ 10, 2018

కథేంటి?

విశ్వరూపం పార్ట్ 1 కు కంటిన్యూయేషన్ కథ ఇది. సోల్జర్ అయిన వాజిం అహ్మద్ (కమల్ హాసన్) ప్లాన్ ప్రకారం ఆల్ ఖైదా టెర్రరిస్టు ఓమర్ (రాహుల్ బోస్)ను మోసం చేసి అమెరికా ఆర్మీకి సహాయపడతాడు. తర్వాత లండన్ లో తనకు అప్పగించిన మిషన్ పనిమీదుంటాడు. కానీ ఆల్ ఖైదా మాత్రం వాజిం మీద ఎటాక్ చేస్తూనే ఉంటుంది. దాని వెనకున్నదెవరు? వాళ్లను వాజిం ఎలా అంతమొందించాడు అనేది మిగతా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఎనర్జీ, నటనతో మరోసారి మెస్మరైజ్ చేసాడు. పూజా కుమార్ పెద్దగా చేసిందేమిలేదు. కమల్ భార్య రోల్ లో కాస్త గ్లామర్ పండించింది. ఆండ్రియా ఆకట్టుకుంటుంది. సపోర్టింగ్ రోల్ లో శేఖర్ కపూర్ రాణించారు. నెగిటివ్ రోల్ రాహుల్ బోస్ బాగా చేశాడు.

సాంకేతిక వర్గ పనితీరు :
టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉంది. షామ్ దత్, సాను వెర్గసె సినిమాటోగ్రపీ హై స్టాండర్డ్స్ లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూయ్స్ బాగున్నాయి. గ్రాఫిక్ వర్క్, యాక్షన్ సీన్లు గ్రాండ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. ఉగ్రవాదం గురించి కమల్ చెప్పే సంభాషణలు కొన్ని బాగున్నాయి.

విశ్లేషణ :
ఐదేళ్ల క్రితం వచ్చిన ‘విశ్వరూపం’కు ప్రీక్వెల్ మరియు సీక్వెల్ ఈ సినిమా. ఫస్ట్ పార్ట్ లో ఉన్నన్ని మెరుపులు లేకపోవడం మైనస్. సినిమా మొదలైనప్పటి నుండి ఫ్లాట్ గా సాగిపోతుంది తప్ప ఎక్కడా వావ్ అనే మూమెంట్ కనిపించదు. ఫస్టాఫ్ వరకు ఓకే అనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సీన్లు, తీవ్రవాదం గురించి హోటల్ లో జరిగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. కానీ సెకండాఫ్ లో అసలు ట్విస్ట్ ఓపెన్ రెగ్యులర్ టర్న్ తీసుకుంటుందీ కథ. స్లో నరేషన్ వల్ల కథ ముందుకు కదలదు. డాక్యుమెంటరీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. మదర్ సెంటిమెంట్ ఎపిసోడ్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. యూజువల్ గా కథ, కథనాలు ఎలా ఉన్నా.. కమల్ హాసన్ తన మ్యాజిక్ తో ఎదోటి చేసి చూడబుల్ గా చేస్తాడు. కానీ ఇక్కడ రాసుకున్నది చేసుకుంటూ పోయాడు తప్ప.. తన మార్కు ఏం చూపించలేకపోయాడు. డైరెక్టర్ గా కూడా కమల్ ఫెయిలయ్యాడనే చెప్పాలి. కథనం స్లోగా ఉన్నప్పుడు ఇంట్రస్టింగ్ యాక్షన్ ఎపిసోడ్ లు ఏవైనా పెట్టాల్సింది. కానీ రెగ్యూలర్ యాక్షన్ మూవీ లాగా తీయడం వల్ల స్పై థ్రిల్లర్ కు కావాల్సిన స్టఫ్ కొరవడింది. ఇక క్లైమాక్స్ కూడా ఊహించినట్టే సాగింది. అసలే లిమిటెడ్ అప్పీయరెన్స్ ఉన్నా ఇలాంటి జోనర్ ను గ్రిప్పింగ్ గా, యాక్షన్ సీన్లతో రక్తి కట్టించాలి. రీసెంట్ గా వచ్చిన గూడచారి దీనికి ఉదాహరణ. కానీ ‘‘విశ్వరూపం 2’’ మాత్రం నిరాశ పరుస్తుంది.

బాటమ్ లైన్ : డాక్యుమెంటరీ స్పై థ్రిల్లర్

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy