రివ్యూ: వైశాఖం

vaishakam-movie-reviewరివ్యూ: వైశాఖం

రన్ టైమ్: 2 గంటల 12 నిమిషాలు

నటీనటులు: హరీష్, అవంతిక,సాయికుమార్, కాశీ విశ్వనాథ్, పృథ్వి, ఈశ్వరీ భాయి, తదితరులు

సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి

మ్యూజిక్: వసంత్

నిర్మాత: బి.ఎ రాజు

రచన,దర్శకత్వం: బి.ఎ జయ

రిలీజ్ డేట్: జులై 21,2017

చంటిగాడు, మంగమ్మ గారి మనవడు, లవ్ లీ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ బి.జయ కాస్త గ్యాప్ తర్వాత అంతా కొత్తవాళ్లతో ‘‘వైశాఖం’’ అనే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ వైశాఖం మూవీ ఆమె కెరీర్ కు ఎంత ప్లస్ అయ్యిందో తెలుసుకుందాం.

కథ:

ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఫ్యామిలీస్ అందరికీ తలనొప్పిగా మారతాడు వేణు (హరీష్). అందరినీ టార్చర్ పెడుతూ, బెదిరిస్తుంటాడు. అదే అపార్ట్ మెంట్ లోకి వేణు ప్రియురాలననీ అబద్దం చెప్పి ఎంటరవుతుంది భానుమతి (అవంతిక). తన లవర్ కాదని తెలుసుకున్న వేణు తనతో గొడవపడుతాడు. భానుమతి కూడా వేణుతో గొడవపడుతుంది. తెలియకుండానే తనను లవ్ చేస్తాడు వేణు. కానీ తను నో చెప్తుంది. మరి వేణు ఎందుకలా అపార్ట్ మెంట్ వాళ్లతో రూడ్ గా బిహేవ్ చేస్తాడు, దాని వెనుక కారణం ఏంటి. భానుమతి ఎవరు? వేణు లైఫ్ లోకి ఎందుకు వచ్చిందన్నదే మిగతా స్టోరీ

నటీనటుల పర్ఫార్మెన్స్:

హీరో హరీష్ ఈజ్ తో బాగా నటించాడు. డ్యాన్సులు కూడా బాగా చేశాడు. హీరోయిన్ గ్లామరెస్ గా ఉంది. నటన ఫర్వాలేదు. సాయి కుమార్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించి సినిమాకు బలం చేకూర్చాడు. ఇక కాశీ విశ్వనాథ్, పృథ్వి, ఈశ్వరీ భాయి, రమాప్రభలు వాళ్ల పరిధిమేర నటించారు.

టెక్నికల్ వర్క్:

బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలల్లో రిచ్ నెస్ తీసుకొచ్చాడు. డి.జె వసంత్ ఇచ్చిన పాటలన్నీ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఎడిటింగ్ క్రిస్ప్ గా బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. బి.జయ రాసుకున్న మాటలు బాగున్నాయి. కొన్ని పంచ్ లు కూడా పేలాయి.

విశ్లేషణ:

‘‘వైశాఖం’’ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కమర్షియల్ విలువలున్న ఈ సినిమాలో అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంది. ఫస్టాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్, టీజింగ్ యూత్ ను ఆకట్టుకుంటాయి. ఇక సెకండాఫ్ లో ఎమెషనల్ కంటెంట్ ఎక్కువుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సాయికుమార్ ఎంటర్ అయ్యాక అసలు కథ మొదలవుతుంది. కొన్ని కామెడీ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోకపోయినా.. ఓవరాల్ గా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుంది. చిన్న పాయింట్ నుంచి బి.జయ రాసుకున్న ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉండటం, కమర్షియల్ అంశాలు ఉండటం పెద్ద ప్లస్. ఫస్టాఫ్ లో అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలున్నా. మ్యూజిక్, హీరోహీరోయిన్ మధ్య సీన్లు, కామెడీ తో పాసైపోతుంది. ఓవరాల్ గా ‘‘వైశాఖం’’ ఒక ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. బి.సి సెంటర్ ఆడియన్స్ కు ఈ మూవీ కనెక్ట్ అయ్యే చాన్సున్న ఈ మూవీని ఒకసారి చూడొచ్చు.

బాటమ్ లైన్- ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్

రేటింగ్: 3/5

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy