రివ్యూ : శ్రీనివాస కళ్యాణం

రన్ టైమ్ : 2 గంటల 20 నిమిషాలు

నటీనటులు : నితిన్, రాశి ఖన్నా, నందితా దాస్, జయసుధ, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, ఆమని, నరేష్, సితార, ప్రవీణ్ తదితరులు

సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి

మ్యూజిక్: మిక్కీ జె.మేయర్

ఎడిటింగ్: మధు

నిర్మాతలు: రాజు, శిరీష్, లక్ష్మణ్

రచన, దర్శకత్వం : సతీష్ వేగేశ్న

రిలీజ్ డేట్ : ఆగస్ట్ 9, 2018

కథేంటి?

పద్దతులు, సంప్రదాయల నడుమ ఉమ్మడి కుటుంబం లో పెరిగిన వాసు (నితిన్) పెద్ద వ్యాపరవేత్త కూతురైన శ్రీ (రాశి ఖన్నా) ప్రేమించుకుంటారు. వీళ్ల పెళ్లికి ఇష్టం లేక పోయినా.. కూతురు కోరిక మేరకు ఒప్పుకుంటాడు ప్రకాష్ రాజ్. కానీ వాసుతో ఓ ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ ఒప్పందం ఏమిటి? దాని వల్ల వచ్చిన సమస్యలేంటి? అసలు వీళ్ల పెళ్లి జరిగిందా లేదా అనేది కథ.

నటీనటుల పనితీరు :

డీసెంట్ కుర్రాడిగా హీరో నితిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే క్యారెక్టర్ ‘రాముడు మంచి బాలుడు’ టైప్ కావడం వల్ల తనకు పెద్దగా చేయడానికేం లేదు. చివర్లో ఎమోషనల్ సీన్లల్లో మాత్రం బాగా చేశాడు. రాశి ఖన్నాకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. నటన పరంగా ఓకే.. కానీ హీరోను ప్రేమగా చూసే ఎక్స్ ప్రెషన్స్ తో విసిగించింది. నందితా శ్వేతా యావరేజ్ గా ఉంది. జయసుధ, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నరేష్ తమకు అలవాటైన పాత్రల్లో రాణించారు. విద్యులేఖ, సత్యం రాజేశ్, ప్రవీణ్ నవ్వించడానికి ట్రై చేశారు.

టెక్నికల్ వర్క్ :

సమీర్ రెడ్డి సినిమాటోగ్రపీ బాగుంది. పల్లెటూరి అందాలను బాగా కాప్చర్ చేశాడు. మిక్కి జె.మేయర్ పాటల్లో రెండు మాత్రమే బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూయ్స్ రిచ్ గా ఉన్నాయి. సతీష్ వేగేశ్న రాసుకున్న కొన్ని ఎమోషనల్ డైలాగులు బాగానే పేలాయి.

విశ్లేషణ :

ముందు నుంచి చెప్పినట్లుగానే ‘శ్రీనివాస కళ్యాణం’ ఓ రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. పెళ్లి విలువను గురించి చెప్పే సినిమా. కానీ ఆ విలువలు, మెసేజ్ కావాలని జొప్పించినట్టుగా చెప్పడం వల్ల ‘శ్రీనివాస కళ్యాణం’ విసుగు పుట్టిస్తుంది. కథే కొత్తగా లేదనుకుంటే.. వేగేశ్న సతీష్ కథనం కూడా అలాగే ఉంది. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో చెప్పేయ్యచ్చు. పాతకాలం నాటి స్టోరీ, స్క్రీన్ ప్లే కావటం వల్ల ‘‘శ్రీనివాస కళ్యాణం’’ రెండున్నర గంటల వెడ్డింగ్ వీడియోను తలపిస్తుంది. పెళ్లి, సంప్రదాయాల గురించి చెప్పాలనుకుంటే కాస్తయినా.. సన్నివేశాల్లో సహజత్వం, బలం ఉండాలి. ఇక్కడ ప్రతీ సీన్ ఫోర్స్ డ్ గా ఉండటం వల్ల ఎమోషన్స్ ఏవీ పండలేదు. సందేశాలు ఇరికించినట్టు అనిపిస్తాయి. మన హీరో క్యారెక్టర్ ప్రతి 5 నిమిషాలకోసారి పెళ్లి గురించి, బంధాల గురించి క్లాస్ పీకుతుంటాడు. ఇలాంటి సీన్లు ఒకింత విసిగిస్తాయి. ఇక ఈ కథలో పెట్టిన కాన్ ఫ్లిక్ట్ స్ట్రాంగ్ గా లేదు. ఆ పాయింట్ వల్ల క్లైమాక్స్ లో ఎమోషనల్ డైలాగులకు ఉపయోగపడింది తప్ప ఫలితం చేంజ్ చేసేంత లేదు. చివరి 20నిమిషాలు పెళ్లి గురించి, ప్రకాష్ రాజ్ రియలైజ్ అయి చెప్పిన డైలాగులు బాగానే వచ్చాయి. ఓ సెక్షన్ ఫ్యామిలీ ఆడియన్స్, విడాకుల గురించి ఆలోచించే కొందరు కనెక్ట్ అయ్యే అవకాశమున్నా.. ఓవరాల్ గా మాత్రం ‘‘శ్రీనివాస కళ్యాణం’’ మెప్పించదు..

బాటమ్ లైన్: వెడ్డింగ్ వీడియో

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy