రివ్యూ : సప్తగిరి LLB

sapthagiriరన్ టైమ్: 2 గంటల 19 నిమిషాలు

నటీనటులు: సప్తగిరి, కశిష్ వోహ్రా, సాయికుమార్, శివప్రసాద్, శకలక శంకర్, గొల్లపూడి మారుతిరావు, ఎల్బీ శ్రీరామ్

కథ: సుభాష్ కపూర్

మాటలు: పరచూరి బ్రదర్స్

ఎడిటింగ్: గౌతమ్ రాజు

సినిమాటోగ్రఫీ: సారంగం

మ్యూజిక్: విజయ్ బుల్గానిన్

నిర్మాత: డా.రవికిరణ్

దర్శకత్వం: చరణ్ లక్కాకుల

రిలీజ్ డేట్ : డిసెంబర్ 7,2017

కమెడియన్ నుంచి హీరోగా మారాడు సప్తగిరి. తను హీరోగా చేసిన మొదటి సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ పెద్దగా సక్సెస్ కాకపోయినా.. తనకున్న ఇమేజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇప్పుడు అదే ప్రొడ్యూసర్ తో బాలీవుడ్ లో హిట్ అయిన ‘‘జాలీ ఎల్.ఎల్.బి’’ సినిమాను రీమేక్ చేశారు. మంచి కంటెంట్ ఉన్న ఈ కథతో సప్తగిరి ఏ మేరకు సక్సెస్ అయ్యాడో సమీక్షిద్దాం.

కథేంటి..

LLB పాసైన సప్తగిరి పెద్ద కేసులు వాదించడానికి కావాల్సిన అనుభవం కోసం హైదారాబాద్ జిల్లా సెషన్స్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తాడు. అక్కడ పెద్ద లాయర్ అయిన రాజ్ పాల్ (సాయికుమార్) ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వాదిస్తుంటాడు. పెద్ద వాళ్లు ఇన్వాల్వ్ కావడంతో భారీ ఫీజు వసూల్ చేస్తూ ముద్దాయిని తప్పించాలనుకుంటాడు. అది తెలుసుకున్న సప్తగిరి ఎలాగైనా ఆ కేసును టేకప్ చేసి భాదితులకు న్యాయం చేయాలనుకుంటాడు. ఆ కేసు ఇంటరాగేషన్ లో అతను తెలుసుకున్న నిజాలు ఏంటి? రాజ్ పాల్ ను ఎదుర్కొని ఆ కేసును ఎలా గెలిచాడు అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

సప్తగిరి బాగా చేశాడు. ఎమోషనల్ సీన్లల్లో తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. డాన్సులు, ఫైట్లు బాగా యాక్టివ్ గా చేశాడు. హీరోయిన్ మైనస్. నెగిటివ్ షేడ్స్ ఉన్న లాయర్ పాత్రలో సాయి కుమార్ రాణించాడు. జడ్జి క్యారెక్టర్ లో శివ ప్రసాద్ మెప్పించాడు. ఈ ఇద్దరి నటన క్లైమాక్స్ లో బాగా రావడానికి హెల్ప్ అయ్యింది. గొల్లపూడి మారుతిరావు, ఎల్.బి శ్రీరాం బాగా చేశారు. శకలక శంకర్ కు సరైన క్యారెక్టర్ దక్కలేదు.

టెక్నికల్ వర్క్:

సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఎడిటింగ్ షార్ప్ గా ఉండాల్సింది. చాలా చోట్ల తెలియకుండానే కట్ వచ్చేస్తుంది. పరచూరి బ్రదర్స్ డైలాగ్స్ క్లైమాక్స్ లో బాగా పేలాయి.

విశ్లేషణ :

హిందీలో సక్సెస్ అయిన ‘జాలీ ఎల్.ఎల్.బి’ని సప్తగిరితో రీమేక్ చేయాలనుకోవడం మంచి ఐడియానే. ఎంటర్ టైన్ మెంట్ కు బాగా స్కోప్ ఉన్న ఈ కథను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఇక్కడ కూడా వర్కవుట్ అవుతుంది. డైరెక్టర్ కొత్తవాడు కావడంతో ఆ తేడా కనిపించింది. మంచి కమర్షియల్ సక్సెస్ కు ఆస్కారమున్న ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ని తన అనుభవ లేమితో ఓ సాదాసీదా ఎంటర్ టైనర్ గా ముగించేశాడు డైరెక్టర్. సప్తగిరి కూడా కొన్నిసార్లు ఓవర్ ది బోర్డ్ వెళ్లి ఇరిటేట్ చేశాడు. పాటలు, అనవసరమైన ఫైట్ల కోసం ప్రయత్నించి పక్కదోవ పట్టించారు. చివరి 30నిమిషాలు మాత్రం బాగా నడిపించాడు దర్శకుడు చరణ్ లక్కాకుల. కోర్టు రూమ్ ఎపిసోడ్ ను ఆసక్తికరంగా మలిచి సేవ్ చేశాడు. ఈ ఎపిసోడ్ లో సప్తగిరి నటన, రైతుల గురించి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటాయి. సాయి కుమార్, శివప్రసాద్ కూడా న్యాయం చేయడంతో ఎండింగ్ పక్కాగా కుదిరింది. హిందీ సినిమా చూసిన వాళ్లకు నచ్చకపోవచ్చు కానీ కొత్త ఆడియన్స్ కు ఫర్వాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ ను భరిస్తే.. సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకసారి చూసే సినిమానే..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy