రివ్యూ : హిట్టు కొట్టిన టైసన్

Venkatapuram-reviewరివ్యూ: వెంకటాపురం – హిట్టు కొట్టిన టైసన్ (3.25/5)

రన్ టైమ్: 1 గంట 50 నిమిషాలు

నటీనటులు: రాహుల్, మహిమ మక్వానా, అజయ్ ఘోష్, అజయ్, కాశీ విశ్వనాథ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్

మ్యూజిక్: అచ్చు

ఎడిటింగ్: నందు

నిర్మాతలు: శ్రేయాస్ శ్రీనివాస్,ఫణికుమార్

స్క్రీన్ ప్లే,డైరెక్షన్: వేణు మదికంటి

రిలీజ్ డేట్: మే 12,2017

ఇంట్రో:

హ్యాపీడేస్ మూవీ లో టైసన్ పాత్రతో అందరిని ఎంటర్ టైన్ చేసిన రాహుల్ సినిమా సినిమాకు ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాడు. కొంత గ్యాప్ తీసుకుని ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఫస్ట్ లుక్ తోనే ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఆ తరువాత రిలీజైన ట్రైలర్ తో అంచనాలు పెంచుకుంది. ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం..

కథేంటి?:

వైజాగ్ భీమిలీ బీచ్ లో జరిగిన ఒక అమ్మాయి మర్డర్ కేసును.. వెంకటాపురం పోలీస్ స్టేషన్ పోలీసులు టేకప్ చేసి విచారిస్తుంటారు. వాళ్ళ విచారణలో ఆ అమ్మాయిని మర్డర్ చేసింది ఆనంద్ (రాహుల్) అని, ఆ అమ్మాయి పేరు చైత్ర (మహిమ మక్వాన్) అని, ఆనంద్.. ప్రేమించిన అమ్మాయేనని పోలీసులు తేలుస్తారు. అసలు ఆనంద్, చైత్రలు ఎవరు? వాళ్ల స్టోరీ ఏంటి? నిజంగానే ఆనంద్ హత్య చేశాడా ? వాటి వెనకున్న వాస్తవాలు ఏంటి ? అనేదే ఈ సినిమా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో రాహుల్ గురించి.. ఈ సినిమా కోసం కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేశాడు. తన లుక్ కూడా చాలా బాగుంది. ఆనంద్ పాత్రలో ఇంటెన్స్ పర్ఫార్సెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ రాహుల్ కెరీర్ కు బాగా ప్లస్ అవుతుంది. ఇక హీరోయిన్ గా నటించిన కొత్తమ్మాయి మహిమా మక్వానా మిడిల్ క్లాస్ అమ్మాయిగా బాగా సూట్ అయింది. తన నటన కూడా బాగుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఎస్.ఐగా అజయ్ ఘోష్ మెప్పించాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా చేసిన అజయ్ ది తక్కువ రోల్ అయినప్పటికీ.. ఎఫెక్టివ్ గా ఉంది.

టెక్నికల్ వర్క్:

టెక్నికల్ టీమ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్ గురించి.. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీని అందంగా చూపించాడు. పాటల పిక్చరైజేషన్ చాలా బాగుంది. ఇక అచ్చు మ్యూజిక్ సినిమాకు మరో అట్రాక్షన్. పాటలన్నీ చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాలకు కీలకమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కూడా అచ్చు అదరగొట్టాడు. మధు ఎడిటింగ్ ఫర్వాలేదు. డైరెక్టర్ వేణు స్క్రీన్ ప్లే ను పకడ్బందీగా రాసుకున్నాడు.

ప్లస్ లు:

  1. రాహుల్
  2. సినిమాటోగ్రఫీ
  3. మ్యూజిక్
  4. ట్విస్ట్

మైనస్ లు

  1. ఫస్టాఫ్
  2. కొన్ని లాజిక్ లు

విశ్లేషణ:

తెలుగు సినిమాలు రొటీన్ గా ఉంటాయనే విమర్శ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతోంది. కొత్తవాళ్లు డిఫరెంట్ కథ లను ఎంచుకుంటూ.. టాలెంట్ తో ముందుకు వస్తున్నారు. ఇప్పుడున్న యంగ్ హీరోలు కూడా కొత్తగా ఆలోచించి సినిమాలు చేస్తున్నారు. ‘‘వెంకటాపురం’’ కూడా ఆ డిఫరెంట్ సినిమా కోవలోకే వెళుతుంది. కొన్ని ఫ్లాప్ ల తర్వాత హీరో రాహుల్ ఇలాంటి కొత్త కథను సెలక్ట్ చేసుకోవడం అభినందనీయం. ఎలాంటి కమర్షియల్ హంగుల కోసం పోకుండా, నమ్మిన కథను నిజాయితీగా తెరకెక్కించారు దర్శక నిర్మాతలు.మర్డర్ మిస్టరీ పాయింట్ తీసుకుని 2 గంటల సినిమాగా ఎంగేజ్ చేయడం కాస్త రిస్కే అయినా.. కొత్త డైరెక్టర్ వేణు మదికంటి గ్రిప్పింగ్ నరేషన్ వల్ల ఈ సినిమా చివరి వరకు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇక కథలోని ట్విస్ట్ కోసం ఫస్టాఫ్ లో ఉన్న కొన్ని సీన్లు కాస్త బోరింగ్ అనిపించినా.. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా ఊపందుకుంటుంది. సెకండాఫ్ మొత్తం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. పోలీస్ స్టేషన్ లో రాహుల్ సిక్స్ ప్యాక్ ఫైట్ సినిమాకే హైలెట్. ఫస్టాఫ్ లో వేసుకున్న లాక్స్ అన్ని క్లైమాక్స్ లో రివీల్ కావడం ఆకట్టుకుటుంది. చివరి 30 నిమిషాలు డైరెక్టర్ వేణు పనితనం మెప్పిస్తుంది. క్లైమాక్స్ కన్వీన్సింగ్ గా ఉండటంతో ఆడియన్స్ సాటిస్ ఫై అవుతారు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘‘వెంకటాపురం’’ మూవీ రెగ్యులర్ సినిమాల కాకుండా ఒక థ్రిల్ కు గురిచేస్తుంది. ఇలాంటి డిఫరెంట్ స్టోరీని అటెంప్ట్ చేసినందుకు టీం ను అభినందిచాలి. రొటీన్ సినిమాల గురించి కంప్లయిట్ చేసేవాళ్లు.. డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వాళ్లు మాత్రం ఈ సినిమాను ఆస్వాదిస్తారు..

బాటమ్ లైన్: సక్సెస్ ఫుల్ అటెంప్ట్

రేటింగ్: 3.25/5

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy