రివ్వుమంటూ నింగిలోకి : GSLV మార్క్‌3 D2 సక్సెస్

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి ప్రయోగించిన జీశాట్-29 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. GSLV మార్క్3 D2 రాకెట్ ద్వారా స్పేస్ లోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. అనుకున్న ప్రకారమే ఇవాళ (బుధవారం) సాయంత్రం 5 గంటల 8 నిమిషాలకు గగనతలంలోకి పంపించారు. మంగళవారం మధ్యాహ్నం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అయితే గజ తుపాను కారణంగా జీశాట్-29 ప్రయోగానికి ఆటంకం ఏర్పడుతుందేమోనని భావించారు. చివరకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఈ ప్రయోగం విజయవంతమైంది.

3,423 కిలో బరువున్న ఉపగ్రహాలను జీశాట్-29 మోసుకెళ్లింది. S 200 బూస్ట‌ర్ ద్వారా ఈ ప్ర‌యోగాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించారు ఇస్రో సైంటిస్టులు. ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా జీశాట్-29కు రూపకల్పన జరిగింది. ఇందులో కేయూ, కేఏ బ్యాండ్ పేలోడ్స్ ఉన్నాయి. జీశాట్-29 ద్వారా స్పేస్ టెక్నాలజీపై సరికొత్తగా అధ్యయనం చేయనున్నారు.

అంతేగాకుండా కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగుపడనున్నాయి. జీశాట్ విభాగంలో మూడు ఉపగ్రహాలు పంపేలా ప్రణాళిక రూపొందించింది ఇస్రో. ఇప్పటికే జీశాట్-19 ఉపగ్రహన్ని 2017 జూన్ లో స్పేస్ లోకి పంపించారు. ఇప్పుడు జీశాట్-29 ని కూడా సక్సెస్ ఫుల్ గా పంపించారు. మరో ఉపగ్రహమైన జీశాట్-11 ను వచ్చే నెల 4న యూరోపియన్ స్పేస్ పోర్టు నుంచి పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy