రీసెర్చ్ : బంకమట్టి తినండి.. స్లిమ్ గా ఉండండి

కుండలో నీరు తాగడం, మట్టి పాత్రల్లో వండిన అన్నం, కూర తినడం. వెనకటి రోజుల్లో ఇదే వారి లైఫ్ స్టైల్. అప్పటి మనుషులు గట్టిగా ఉన్నారంటే.. బంకమట్టితో చేసిన ఆ కుండలు, పాత్రల్లోని ఆహారం తీసుకోవడమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయం ఇప్పటికే తెలిసినప్పటికీ లేటెస్ట్ గా జరిపిన పరిశోధనలో మరో అంశం తెలిసింది. బంకమట్టితో తయారు చేసిన పాత్రలో ఆహారం తింటేనే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటే.. బంకమట్టినే తింటే ఉలా ఉంటాడు అనే ఆలోచనతో రీసెర్చ్ చేశారు పరిశోధకులు.

ఎలుకలపై చేసిన రీసెర్చ్ లో… కొవ్వు పట్టి ఉన్న ఎలుకలు బంకమట్టి తినడంతో సన్నబడ్డాయని తేలింది. దీంతో మనిషి రిసేర్చ్ చేసిన బంకమట్టి తినడంతో.. శరీరానికి మేలని, బంకమట్టి తింటే పొట్ట తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెలిపారు. మరీ.. పొట్ట తగ్గుతుందని వెంటనే బంకమట్టిని తినవద్దని.. పరీక్షలు చేసిన బంకమట్టిని మాత్రమే తినాలని సూచించారు. సైంటిస్టులు స్పెషల్‌ గా ప్రాసెస్‌ చేసిన బంకమట్టికే సాధ్యం అని తెలిపారు.

పరిశోధనలో.. మొదట కొన్ని ఎలుకలకు ఒబేసిటీ మెడిసిన్, కొన్ని ఎలుకలకు ప్రాసెస్డ్‌ బంక మన్నూ ఇచ్చారు. ఇలా రెండు వారాలపాటు వారు అధ్యయనం కొనసాగించారు. డ్రగ్‌ తీసుకున్న ఎలుకల్లో కంటే మట్టి తిన్న ఎలుకల్లో వెయిట్‌ లాస్‌ స్పష్టంగా కనపడినట్లు గుర్తించారు. రెండు గ్రూపులను పోల్చి చూడగా.. మట్టి తిన్న ఎలుకల్లో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనబడలేదని, అవి ఆరోగ్యంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ బంకమట్టిలోని సన్నటి మురికి లాంటి పదార్థం పేగుల్లోని కొవ్వును పీల్చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. దీన్ని మనుషులపై ప్రయోగించడానికి తమ అధ్యయనం ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పారు.

వేల ఏళ్లుగా మానవుడు ఏదో ఓ రూపంలో మట్టి తింటున్నాడు. అందుకే నాటికాలం మనుషులు ఆరోగ్యంగా ఉన్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు. టెక్నాలజీ, తెలివీ పెరిగాక… చేతులకు సబ్బులూ, వాష్‌ లతో కడిగి మట్టికి బదులు రసాయనాలు తింటూ జబ్బు పడుతున్నారని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy