రుణమాఫీపై రాజుకుంటున్న వేడి..

TRS Chief KCR 1st Telangana CM Astrologersరుణమాఫీపై రాజకీయంగా వేడి రాజుకుంటోంది. ఏడాది క్రితం తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మెల్ల మెల్లగా ఒత్తగి పెంచడం మొదలెట్టాయి. రుణమాఫీ విషయంలో కొత్త నిబంధనలు తేవద్దని, అందరికీ రుణమాఫీ వర్తించేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ మొదలయ్యింది. రుణమాఫీపై కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. 2013-14 రుణాలే మాఫీ చేస్తామనడం రైతులను మోసం చేయడమేనన్నారు. రైతుల నమ్మకాలను వమ్ము చేయొద్దన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటికి భిన్నంగా వ్యవహరిస్తే నిలదీస్తామని హెచ్చరించారు. శాసన మండలి కాంగ్రెస్ పక్ష నేత డీ.శ్రీనివాస్ మాట్లాడుతూ.. రుణమాఫీ కాలపరిమితిపై రైతులు ఆందోళన చెందుతున్నారని గుర్తు చేశారు. కాలపరిమితితో సంబంధం లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంలో పెట్టుబడుల కోసమే రైతులు అప్పులు చేశారని డీఎస్ అన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ నే అని ప్రజలు గుర్తించారని అన్నారు. మరో సీనియర్ నేత డీకె. అరుణ స్పందిస్తూ.. ప్రాధాన్యాలపై సమస్యలుంటే హామీలిచ్చేముందే ఆలోచించుకోవాలని సూచించారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు.

రుణమాఫీపై టీడీపీ నేతలు కూడా ఒత్తిడి పెంచండం మొదలు పెట్టారు. సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రుణమాఫీ అమలు చేయాల్సిందేనన్నారు. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేయాలని సూచించారు. రుణమాఫీపై కేసీఆర్ మాట తప్పారని అన్నారు. ఏ ఒక్క రైతు నష్టపోయినా కేసీఆరే బాధ్యుడన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోనేత రేవంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక ఏడాది క్రితం తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామనడం రైతులను మోసగించడమేనన్నారు. ఇక తెలంగాణను 24 జిల్లాను విభజించే బదులు 17 ఎంపీ స్థానాలనే జిల్లాలుగా మార్చాలని సూచించారు. మహబూబ్ నగర్ ను మూడు జిల్లాలుగా చేస్తే కొడంగల్ ను వనపర్తిలో కలుపొద్దని అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రుణమాఫీ విషయంలో ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించారు. ఏడాది క్రితం రుణాలనే మాఫీ చేస్తాననడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy