రూటు మార్చింది: ఉత్తర దిశగా నైరుతి రుతుపవనాలు

mansoon-222నైరుతి రూటు మార్చిందా.. అంటే అవుననే అంటున్నారు అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు. మందకొండిగా సాగుతూ.. ఉత్తర భారతానికి దిశ మార్చుకుంటున్నాయని ఆ పరిశోధనల్లో తేలింది. నైరుతి రుతుపవనాలు మధ్య భారతదేశానికి ఉత్తరంగా ఎక్కువ బలపడ్డాయని స్పష్టం చేస్తోంది. 2002 నాటి నుంచి ఏటా భారతదేశం మొత్తమ్మీద సగటు ఉష్ణోగ్రత 0.1 డిగ్రీ నుంచి 1 డిగ్రీ సెల్సి యస్‌ వరకూ పెరిగిందని, అదే సమయంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతల పెరుగుదలలో మందగమనం కనిపించిందని ఎంఐటీ గుర్తించింది. అయితే ఈ తేడా ఎక్కువగా ఉండటం వల్ల రుతుపవన మేఘాలు బలంగా మారతాయని… ఎక్కువ వానలు కురిపిస్తాయని..  అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పు ఎందుకు వచ్చిందన్న విషయాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు.

ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగుతుందని.. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మరీ అధ్వానమవుతాయని అందరూ అనుకున్నారు. అయితే ఆఫ్రికా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో మాదిరిగానే ఈ ప్రాంతంలోనూ పరిస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ఆలస్యమైందని ఎంఐటీ శాస్త్రవేత్త చెన్‌ వాంగ్‌ అంటున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy