రూపాయితో 17కిమీ. ప్రయాణం

17kmకనీసం ఐదు రూపాయలు లేకపోతే ఆటో ఎక్కలేం.. బస్సు ముఖం చూడలేం. అలాంటిది రూపాయికే 17కిమీ. ప్రయాణం చేసేయొచ్చు అంటున్నారు ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గ్రూప్ అనే కంపెనీ ప్రతినిధులు. బెంగాల్‌కి చెందిన ఈ కంపెనీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆవు పేడతో బయో గ్యాస్ తయారు చేసింది. ఆ గ్యాస్‌ను ఇంధనంగా ఉపయోగించి వాహనాలను నడిపిస్తోంది. అందులో భాగంగా ఓ బస్సును కోల్‌కతా నగరంలో ఉత్తరాన ఉన్న ఉల్టాదంగా నుంచి దక్షిణాన ఉన్న గరియా వరకు నడిపించారు. ఈ ప్రయాణంలో మొత్తం 17.5 కిలోమీటర్ల దూరానికి లెక్క కట్టగా, అందుకు అయ్యే వ్యయంలో ఒక్కో ప్రయాణికుడికి కేవలం ఒక్క రూపాయే భారం పడుతుంది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన ప్రయాణంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఒక్క బస్సును నడిపిస్తున్న ఈ కంపెనీ, అశోక్ లేలాండ్‌తో చేతులు కలిపింది. త్వరలోనే కలకత్తా నగరంలో 15 బస్సులను నడిపించనున్నట్లు ఫోనిక్స్ ఇండియా గ్రూపు సీఎండీ జ్యోతి ప్రకాష్ దాస్ తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy