
హార్టికల్చర్ ఎగ్జిబిషన్లతో అవగాహన పెంచుకొని.. టెర్రస్ గార్డెనింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు సిటీ ప్రజలు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇంట్లోనే రకరకాల కూరగాయలు పండిస్తున్నారు. దీంతోపాటు ద్రాక్ష, దానిమ్మ, జామ, నిమ్మ, సపోట, బత్తాయి, డ్రాగన్ ఫ్రూట్ వంటి రకాల.. పళ్ల చెట్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు.
పూల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్ కు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జనం. ఇంట్లోనే రకరకాల ఆయుర్వేద మొక్కలతో రూఫ్ గార్డెనింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ తో ఆరోగ్యంతో పాటు.. మానసిక ఉల్లాసం పెరుగుతోందన్నారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ కూరగాయలు, పళ్లను పండించి తినడం ఆనందంగా ఉందని… కెమికల్స్ లేని పంటలు, ఆరోగ్యకరమైన వాతావరణంలో.. ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవటం బాగుందన్నారు.