రూల్స్ బ్రేక్ చేస్తే రూ.2వేలు ఫైన్: కేజ్రీవాల్

delhi-carsపొల్యూషన్ కంట్రోల్ పై ఆప్ సర్కారు కఠిన నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ సమస్యను ప్రభుత్వం ఒక్కటే పరిష్కరించలేదన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్….ప్రజల సహకారం అవసరమన్నారు. న్యూఢిల్లీలో కొత్తగా ప్రతిపాదించిన సరి-బేసి ట్రాఫిక్ రూల్స్ ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందేనన్నారు కేజ్రీవాల్.  12 ఈ విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. 12ఏళ్లలోపు పిల్లలు ఉన్న మహిళలకు.. ఒంటరి మహిళలకు, వీఐపీలకు జనవరి 15వ తేదీ వరకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. సీఎం అయినప్పటికీ తనకు కూడా ఈ రూల్‌ వర్తిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు.
15 రోజుల ట్రయల్ రన్ లో భాగంగా ప్రవేశపెట్టనున్న సరి-బేసి ట్రాఫిక్ రూల్స్… రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్‑సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, సుప్రీంకోర్టు జడ్జీలు, డిప్యూటీ స్పీకర్, ఏవైనా అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ  లిస్టులో  బైక్స్ , రక్షణశాఖ వాహనాలు, పైలట్ కార్లు, సీడీ నంబర్ ప్లేట్లు ఉండే ప్రత్యేక భద్రతా బలగాల వాహనాలకు కూడా సరి-చేసి ఫార్ములా వర్తించదన్నారు. ఇది సక్సెస్ అయితే మరింత విస్తృతం చేసే ఆలోచనలో ఉంది ఢిల్లీ సర్కారు. మరోవైపు  ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు అదనంగా న్యూఢిల్లీలో మరో 6వేల బస్సులు రోడ్డెక్కనున్నాయి. న్యూఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన 19 లక్షలకు పైగా నాలుగు ఫోర్ వీలర్స్  వెహికిల్స్ ఉన్నాయి. కొత్త విధానం వల్ల ఇకపై రోజులో సగం వాహనాలు మాత్రమే తిరగనున్నాయి.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy