రూ.20 కోట్లతో వరంగల్ లో క్రికెట్ స్టేడియం : వివేక్ వెంకటస్వామి

VIVEKవరంగల్ నగరంలో 20 కోట్ల రూపాయలతో అన్ని హంగులతో క్రికెట్ స్టేడియాన్ని కట్టిస్తామన్నారు HCA ప్రెసిడెంట్ జి.వివేక్ వెంకటస్వామి. ఇందుకోసం స్థలం కేటాయించాలని జిల్లా ప్రజాప్రతినిధులను కోరారు. శనివారం (నవంబర్-18 ) డిప్యూటీ సీఎం కడియం, మంత్రి కేటీఆర్ తో కలిసి వరంగల్ కాకతీయ గ్రౌండ్ లో జరిగిన TRS బహిరంగ సభలో మాట్లాడారు వివేక్. అంతకుముందు ముందు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వరంగల్ కు క్రికెట్ స్టేడియం కావాలని కోరడంతో బహిరంగ సభ వేదికపైనే ప్రకటన చేశారు వివేక్ వెంకటస్వామి. HCA ప్రెసిడెంట్ ప్రకటనపై కడియం, కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. సభకు హాజరైన స్థానికులు, యువకులు పెద్ద ఎత్తున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy