రూ.200 నోటు వచ్చేస్తోందీ

200-noteభారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) త్వరలో కొత్తగా 200 రూపాయల నోటును తీసుకురానుంది. గతనెలలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. నోట్ల చెలామణిలో పలుమార్పులు కూడా తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం ఉన్న కాగితం నోటుస్థానంలో చాలాకాలం మన్నికగా ఉండే ప్లాస్టిక్ నోట్లు తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తున్నది. నగదు లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి త్వరలో రూ.200 నోటు ముద్రణకు సిద్ధమవుతుంది ఆర్బీఐ. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాలకు కొంతకాలం క్రితమే ఈ నోట్ల ముద్రణ మాధ్యతను అప్పగించారు. నకిలీవి సృష్టించడానికి వీల్లేని రఅతిలో రూ.200 నోట్లలో అదనపు భద్రత పరమాణాలు చేర్చారు. రూ.100, రూ.500 మధ్య ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ నగదు పనులు సులభమవుతాయని బ్యాంకుల అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy