రూ.200 నోటు : వారం రోజుల్లో విడుదల

200-noteభారతదేశ చరిత్రలోనే మొదటిసారి రూ.200 నోటు విడుదల చేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). ఇప్పటికే మైసూర్ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రణ ప్రారంభమైంది. మార్కెట్లోకి బ్యాంకుల ద్వారా విడుదల తేదీని కూడా నిర్ణయించేసింది. వారం, 10 రోజుల్లో ప్రజల దగ్గరకు వస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారం విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

రూ.200 నోటు రాకతో చిన్ననోట్ల చెలామణి పెరుగుతుందని భావిస్తున్నారు ఆర్థిక నిపుణులు. నోట్ల రద్దుకి ముందు 86శాతంగా ఉన్న పెద్ద నోట్ల చెలామణి.. నోట్ల రద్దు తర్వాత 70శాతానికి దిగి వచ్చింది. రూ.200 నోటుతో ఆ శాతం మరింత దిగి వస్తందని అంచనా వేస్తున్నారు. వారం రోజుల్లో మొదటి విడతగా 50 కోట్ల రూపాయల విలువైన 200 నోట్లను రిలీజ్ చేయనున్నట్లు నిర్ణయించింది ఆర్బీఐ. దీంతో 2వేల నోటుకి చిల్లర సమస్య కూడా తీరిపోతుందని చెబుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

200 రూపాయల నోటును భారతదేశం చరిత్రలో మొదటిసారి తీసుకురావటం ఇదే. ముఖ్యంగా రెండు ఉద్దేశాలతో ఈ నోటు తీసుకువస్తోంది RBI. నగదు లావాదేవీల సులభతరం కోసం ఒకటి అయితే.. చిన్న కరెన్సీ నోట్ల చెలామణిని పెంచటం మరో ఉద్దేశం. వారం రోజుల్లో విడుదల కానున్న ఈ కొత్త నోటు ప్రభుత్వ ప్రయోజనాలను ఎంత వరకు నెరవేర్చుతుందో చూడాలి..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy