రూ.250 తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు దిగివస్తున్నాయి.  శనివారం నాటి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి ..రూ.31 వేల450గా ఉంది. వెండి స్వల్పంగా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు జరగడంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 70 పెరిగి రూ. 38 వేల 150కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, దేశంలో శుభకార్యాల సీజన్‌ లేకపోవడంతో.. గోల్డ్ కి డిమాండ్‌ పడిపోయింది. దీంతో ధర కాస్త తగ్గుముఖం పట్టింది.

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ పరిస్థితుల క్రమంలో డాలర్‌ మరింత బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ తగ్గింది.  స్థానిక జ్యువెల్లరీ వ్యాపారుల నుంచి కూడా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో.. దేశీయంగా బంగారం ధర పడిపోయిందని చెబుతున్నాయి మార్కెట్‌ వర్గాలు. అంతర్జాతీయంగానూ ఈ లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. న్యూయార్క్‌ లో శుక్రవారం నాటి ట్రేడింగ్‌ లో ఔన్సు గోల్డ్ రేట్ 0.68శాతం తగ్గి ..1,198.70డాలర్లు పలికింది. వెండి 0.38శాతం తగ్గి.. ఔన్సు ధర 14.25డాలర్లుగా ఉంది.

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy