రూ.628 కోట్లతో 412 రిజర్వాయర్లు: కేటీఆర్

ktrజంట నగరాల్లో నీటి ఎద్దడి నివారణకు గానూ రూ. 628 కోట్లతో 412 రిజర్వాయర్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేశామన్నారు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. బుధవారం (ఆగస్టు-16) కొంపల్లిలో జలమండలి రిజర్వాయర్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ‘రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో 183 గ్రామాలకు, 7 మున్సిపాలిటీలకు తాగునీరు ఇచ్చేందుకు 2041 కి.మీ పైపులైన్‌ నిర్మిస్తాం. ఇంటింటికి నీళ్లు ఇస్తాం. లేకుంటే ఓట్లు అడగం. 104 గ్రామాలకు 300కోట్లతో గజ్వెల్ లో మంచినీటి సరఫర అందిస్తున్నాం. కీసర, ఘట్ కేసర్, హయత్ యగర్, మహేశ్వరం, సరూర్ నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, పటాన్ చెరు, 628 కోట్లతో 10 లక్షల ప్రజలకు వచ్చే ఏడాదిలోగా మంచి నీళ్లు అందిస్తాం.

దేశంలో మంచి నీరు అందించలేని ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. సంక్షేమ పథకాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దూసుకుపోతుంది. తెలంగాణ రాకముందు ఎంతో వ్యతిరేకత ఉండేది. వాటిని పటాపంచెలు చేశారు సీఎం కేసీఆర్. ఏడాదిలోనే ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చి చూపిస్తాం. మహారాష్ట్రల, కర్ణాటకలో, పరిస్థితి దారుణంగా ఉంది. 24 గంటల నిరంతర కరెంటు ఇస్తున్నాం. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చుదిద్దుతున్నాం. శివారు ప్రాంతాలవారి కోసం కొత్తగా రిజర్వాయర్లు ఏర్పాటుచేస్తున్నాం. రిజర్వాయర్ల ద్వారా మూడేళ్లు వర్షాలు సరిగ్గా పడకపోయినా ప్రజలకు నీరందించవచ్చు. భారతదేశంలోనే ఇతర రాష్ట్రాలను తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది‘ అన్నారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌ రెడ్డి, ఎంపీలు మల్లారెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

KTR Laying Foundation stone for Mission Bhagiratha -Live

KTR Laying Foundation stone for Mission Bhagiratha -Live

V6 News 发布于 2017年8月15日周二

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy